Joint pain: కీళ్ల నొప్పులు (Joint pain)… నేటి దైనందిత జీవితంలో వయసుతో సంబంధం లేకుండా మనుషులను పట్టిపీడిస్తున్న రోగాలలో కీళ్ల నొప్పులు ఒకటి. పెరుగుతున్న వాతావరణం కావచ్చు, కలుషిత నీరు కావచ్చు, ఎరువులతో పండించబడిన ఆహారం కావచ్చు, జంక్ ఫుడ్ కావచ్చు… ఇలా రకరకాలైన అలవాట్లు మనిషి జీవన చక్రాన్ని నాశనం చేస్తున్నాయి. అందుకే పట్టణాల్లోనే కాకుండా పల్లెల్లో కూడా కీళ్ల సమస్యలు సర్వసాధారణం అయిపోయాయి. ఎంతలాగా అంటే… ఒక ఇంట్లో కనీసం ఒక్కరు చొప్పున నేడు కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారని సర్వేలో చెబుతున్నాయి.
మరి అలాంటి కీళ్ల నొప్పుల (Joint pain) నుండి ఉపశమనం ఎలా పొందాలి అనేది ఇక్కడ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఈ చలికాలంలో చాలామంది కీళ్ల నొప్పుల (Joint pain) నుండి ఎక్కువగా బాధపడుతూ ఉంటారు. కీళ్లనొప్పి ఉన్నప్పటికీ కూడా ప్రతిరోజు కొద్దిపాటి వ్యాయామం చేయడం ద్వారా చాలా మేలు చేకూరుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. వ్యాయామం చేయడానికి సమయం లేకపోతే, రోజూ స్ట్రెచింగ్ కూడా చేయవచ్చు. దీనితో చేతులు, కాళ్ళలో(legs)కదలిక ఏర్పడి నొప్పి నుంచి వేగంగా ఉపశమనం కలిగిస్తుంది.
అయితే చలి తీవ్రత కారణంగా నొప్పులు (pains) ఎక్కువగా ఉంటాయి కాబట్టి, ఉన్నితో తయారు చేయబడిన దుస్తులు ధరించడం ద్వారా కొంతమేర ఉపశమనం పొందవచ్చు. ముఖ్యంగా మీకు నొప్పి కలిగిన ప్రాంతంలో వేడి నీళ్లతో ప్రతి రెండు మూడు గంటలకు ఒకసారి తాపడం పెట్టుకోవడం చాలా ఉత్తమమైన పని. ఇలా చేయడం వల్ల ఎంతో కొంత రిలీఫ్ దొరుకుతుంది. అదేవిధంగా గోరువెచ్చని నీటిలో కొన్ని ఆవనూనె చుక్కలను వేసుకుని అందులో పాదాలు కాసేపు నానబెట్టడం వలన కూడా మేలు జరుగుతుంది. అదేవిధంగా నొప్పిగా ఉన్న ప్రాంతంలో గోరువెచ్చని నీటితో ఒక క్లాత్ (cloth) సహాయాన్ని తీసుకొని మర్దన చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
ఇక అన్నిటికీ మించి మీరు ఏ ఏరియాలో ఉంటున్నారో, అక్కడ మీకు లభించిన నీటి పీహెచ్ విలువలు ఏ స్థాయిలో ఉన్నాయో ముందు తెలుసుకోండి. అలా తెలుసుకోవడం ద్వారా మీకు ప్రాబ్లం ఎక్కడ మొదలైందో కూడా తెలుసుకోవచ్చు. తద్వారా మీరు ప్రతిరోజు త్రాగుతున్న మంచినీటి విషయంలో కడు జాగ్రత్తలు తీసుకోవచ్చు. ముఖ్యంగా సుద్ధ కలిగిన నీరు, తెమడగా అనిపించిన నీరు, లవణ రూపంలో ఉన్న నీటిని తీసుకోకపోవడం ఉత్తమమైన నిర్ణయం అవుతుంది. అలాంటివారు బయట దొరికిన మినరల్ వాటర్ కంటే కూడా, ఇంటిలోనే ఒక ప్యూరిఫైయర్ పెట్టుకోవడం చాలా ఉత్తమం. ఏది ఏమైనా మన ఆరోగ్యం అనారోగ్యం విషయంలో నీరు అనేది చాలా ప్రాముఖ్యత కలిగిన పాత్రను పోషిస్తుందని విషయం మర్చిపోవద్దు!