Kiwi juice: ప్రపంచంలో కరోనా వచ్చిన తర్వాత అందరు కూడా రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి తెగ ప్రయత్నం చేస్తన్నారు. ఇందులో భాగంగా కివీ జ్యూస్ (Kiwi juice) రోగనిరోధక వ్యవస్థకు బాగా మంచిది. కివీ విటమిన్-సి ఇందులో పుష్కలంగా లభిస్థుంది. అలాగే రోగనిరోధక శక్తిని (Immunity)బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. కివి జ్యూస్ తాగడం వాళ్ళ రక్తపోటు నియంత్రణలో సహాయపడుతుంది. కివీ జ్యూస్ తీసుకోవడం వల్ల శరీరం అనేక సమస్యల నుండి బయటపడుతుంది. ఈ జ్యూస్ తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో చూద్దామా..
నిజానికి కివీ జ్యూస్లో ఫైబర్ (Fiber in kiwi juice)పుష్కలంగా ఉంటుంది. కివీ రసం తాగడం వాళ్ళ మలబద్ధకం, ఇతర కడుపు సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. కివి జ్యూస్ బరువు తగ్గడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కంటి చూపును కివీ జ్యూస్ ( kiwi juice)మెరుగుపరుస్తుంది.
ఇక కివీ వినియోగం వల్ల డెంగ్యూ, మలేరియా (Dengue, Malaria)వంటి వ్యాధులు నయమవుతాయి. అలాగే శరీరంలోని బలహీనతలను తొలగించడానికి కూడా సహాయపడుతుంది. ఇక గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో కూడా సహాయపడుతుంది. కివీ వినియోగం వల్ల చర్మం మెరుస్తూ జుట్టు మెరుస్తుంది.
అలాగే కివీ జ్యూస్ క్రమం తప్పకుండా తీసుకోవటం వల్ల కంటి చూపును కూడా మెరుగు పడుతుంది. అలాగే కళ్ళు ఆరోగ్యంగా ఉండాలంటే కివీ జ్యూస్ తీసుకోవాలి. ఇది కంటి చూపును పదును పెడుతుంది. అనేక రకాల ఐ ఇన్ఫెక్షన్ల నుండి కూడా బయట పడవచ్చు. ఇక ఎక్కువగా రక్తపోటు సమస్యతో (Blood pressure problem)బాధపడుతున్నవారికి కివీ జ్యూస్ అద్భుత ఔషధంగా పని చేస్తుంది. కివీ జ్యూస్లో మెగ్నీషియం, పొటాషియం ఉంటాయి. ఇది రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. కివీ జ్యూస్ జీర్ణవ్యవస్థకు మంచిది. కడుపు సంబంధిత సమస్యలు ఉన్నవారు కివీ జ్యూస్ తీసుకోవాలి. ఇందులో ఉండే పోషకాలు మలబద్ధకం సమస్య నుంచి ఉపశమనం పొందడంలో ఉపయోగ పడుతుంది.
కివీ జ్యూస్ అధిక బరువు, ఊబకాయం (Overweight, obesity) సమస్యతో ఇబ్బంది పడుతున్నవారికి కూడా బెస్ట్ అప్షన్ అనే చెప్పాలి. కివీ జ్యూస్లో యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ హైపర్టెన్సివ్ లక్షణాలు కూడా ఉన్నాయి.