Green Leafy Vegetables: సాధారణంగా ఏదైనా ఆరోగ్య సమస్య వచ్చినప్పుడు ఆకుకూరలు ఎక్కువగా తినాలని చాలామంది డాక్టర్లు సూచిస్తుంటారు. ఎందుకంటే ఆకుకూరలు (Green Leaf Vegetables) ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. గ్రీనీ లీఫ్ వెజిటేబుల్స్‌లో ఔషధ గుణాలు పుష్కలంగా ఉంటాయి కాబట్టి వీటిని ఆహారంలో కచ్చితంగా భాగం చేసుకోవాలి. వానాకాలం (Monsoon)లో మాత్రం వీటిని తింటే ఆరోగ్యం ఇంప్రూవ్ కావడం అటు ఉంచితే అనారోగ్యాలు వస్తాయి. ఆకుకూరలను ఈ మాన్‌సూన్ సీజన్‌లో తింటే వివిధ రకాల అనారోగ్యాలు వస్తాయని డాక్టర్లు చెబుతున్నారు. మిగతా కాలాల్లో ఇవి ఆరోగ్యకరమే అయినా వర్షాకాలంలో మాత్రం ఆరోగ్యానికి హాని చేస్తాయి. అలా ఎందుకో చేస్తాయో తెలుసుకుందాం.
రెయినీ సీజన్‌లో చాలా తేమ, తడి వాతావరణం (Humid, wet weather) నెలకొంటుంది. ఈ వాతావరణంలో బ్యాక్టీరియా (Bacteria)తో పాటు వ్యాధులకు కారణమయ్యే అనేక వృద్ధి చెందుతాయి. ఇవన్నీ ఆకుకూరల మీదకు చేరే అవకాశం ఎక్కువ. ఈగలు, ఇతర కీటకాలు కూడా ఆకుకూరల మీద వాలుతాయి. ఈ కారణంగా లీఫీ వెజిటేబుల్స్ తింటే వివిధ రకాల జబ్బులు (Various diseases) తలెత్తుతాయి. రవాణా చేసే సమయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే కూడా ఈ వెజిటేబుల్స్ మురికిగా తయారవుతాయి. వీటి పైన బ్యాక్టీరియా, వైరస్‌లు చేరుతాయి. అవి తింటే ఫుడ్ పాయిజనింగ్ అయ్యే ప్రమాదం ఎక్కువ. అంతేకాదు డయేరియా కడుపులో నొప్పి ఇతర పేగు సంబంధిత సమస్యలు రావచ్చు.
ఈ కాలంలో ఆకుకూరలు తినకపోవడం మంచిది. ఒకవేళ తినాలనుకుంటే వీటిని బాగా శుభ్రం చేయాలి. చాలా ఫ్రెష్ గా ఉన్న ఆకుకూరలు మాత్రమే ఉంచుకోవాలి. ఆకుకూరల వల్ల నేరుగా ఎలాంటి ప్రమాదం ఉండదు కానీ వాటి మీద చేరే క్రీముల వల్లే రిస్క్ పెరుగుతుంది. ఈ కాలంలో పురుగులు, బ్యాక్టీరియాలు ఆకుకూరలపై సంతానోత్పత్తిని పెంచుకుంటాయి. ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ వెజిటేబుల్స్ తినేటప్పుడు వాటిని చాలా క్లీన్ చేసుకోవాలి.
ఆకు కూరలను వేరు చేసుకుని ఒక్కొక్కటి బాగా కడుక్కుని, వాటిని పొడి గుడ్డపై ఎండ పెట్టడం ద్వారా చాలావరకు క్రీమ్‌లను తొలగించుకోవచ్చు. వీటిని వండే ముందు ఒక చిటికెడు ఉప్పు వేసి నీటిలో కొంతసేపు బాయిల్ చేయాలి. ఇలా చేస్తే మిగిలిన క్రిములు కూడా చచ్చిపోతాయి.