Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Milk Heating: ప్యాకెట్ పాలను ఎక్కువ సేపు వేడి చేస్తే ఏమిఅవుతుందంటే..?

Milk Heating: సహజంగా మనలో చాలా మంది పాలను చాల ఇష్టంగా తాగుతారు. పాత కాలంలో నేరుగా గెదేలు, ఆవులు ఉన్న వారింటికి వెళ్లి పాలను తీసుకోని వచ్చే వారు. ప్రస్తుతం మాత్రం పరిస్థితులు తారు మరు అయ్యాయి. ఏకంగా గ్రామాలలో కూడా పాల ప్యాకెట్లు వచ్చాయి. ఇక పట్టణాలు, నగరాల (Towns and cities) విషయానికి వస్తే స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అయితే ప్యాకెట్ పాలను ఎంత సేపు మరిగించాలో మిలో ఎవరికైనా తెలుసా. ఎక్కువ సేపు మరిగిస్తే జరిగే అనర్థాల గురించి మీకు తెలుసా అవి ఏమిటంటే…

నిజానికి పాలలో అనేక పోషక విలువలు (Nutritional values) కలిగి ఉంటాయి. పాలలో ఉండే క్యాల్షియం మన ఎముకలను దృఢంగా చేయడానికి బాగా సహాయ పడుతాయి. అందుకే చిన్నపిల్లలు, వృద్ధులకు ప్రతిరోజూ ఒక గ్లాసు చొప్పున తాగాలి అని డాక్టర్లు తెలుపుతూ ఉంటారు. పాలలో ఉండే పోషకాలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే ప్యాకెట్ పాలు వాడే వారు వాటిని ఎక్కువ సేపు మరిగించకూడదని డైటీషియన్లు వారి అభిప్రాయాన్ని తెలుపుతున్నారు. అలా ఎక్కువ సేపు మరిగించడం వల్ల వాటిలోని పోషకాలు, విటమిన్లు నశిస్తాయని తెలుపుతున్నారు .ఎక్కువ సేపు మరిగిస్తే ఏం అవుతానందంటే..

నిజానికి పాలను ప్యాక్ (Pack milk)చేయడానికి ముందు పాశ్చరైజ్ చేస్తారు. అంటే 71డిగ్రీల సెల్సియస్ వద్ద వాటిని వేడి చేసి మళ్లీ సున్నా డిగ్రీల వద్ద చల్లబరుస్తారు. అనంతరం వాటిని ప్రాసెస్ చేసి ప్యాకింగ్ చేస్తారు. దీని వల్ల వివిధ రకాల అనారోగ్యాలు, వ్యాధులకు కారణమయ్యే బ్యాక్టీరియా చనిపోతుంది. ఈ విధానంలో మైక్రో ఆర్గానిజంల సంఖ్య గణనీయంగా తగ్గించి పాలను వాడుకునేందుకు అనువుగా మారుస్తారు. ఇలాంటి పాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అయితే ఇంతకు ముందు మనం చెప్పుకున్నట్లు 71డిగ్రీల సెల్సియస్ వద్ద వేడి చేసి చల్లబరిచిన పాలను మళ్లీ మనం అతిగా వేడి చేస్తే అందులోని పోషక విలువలు దెబ్బతింటాయని నిపుణులు అంటున్నారు.

అలాగే ప్యాకెట్ పాలను (A packet of milk)వాడేవారు కొన్ని జాగ్రత్తలు తప్పని సరి అవి ఏమిటంటే… పాలు పొయ్యి మీద పెట్టి ఇతర వేరే పనులు ఏమి చేయవద్దు. అక్కడే ఉండి ఐదు నిమిషాలపాటు వేడి చేస్తే చాలు. ఐదు నిమిషాలకు మించి వాటిని వేడి చేయవద్దు అని నిపుణులు అంటున్నారు. అంతేకాకుండా ఏ రోజు ప్యాకెట్ పాలను ఆ రోజే వాడుకోవడం కూడా మంచిదట. పాల (milk)విషయంలో ఈ జాగ్రతలు పాటిస్తే మనకే మంచిది.