Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Neem Water: వేపాకు నీటితో స్నానం వాళ్ళ కలిగే లాభాలు ఇవే

Neem Water: వాస్తవానికి వేప చెట్టు (neem tree).. మనకు ప్రకృతి ప్రసాదించిన ఒక ఔషధగని..ఆయుర్వేదంలో ఈ చెట్టు ఉపయోగాలు అనేకం ఉంటాయి అని అందరికి తెలిసిన విషయమే. ఇక వేప చెట్టు మనకీ వంద శాతం ఉపయోగపడుతుంది. వేప చెట్టు ఆకులు, బెరడు, పువ్వు, కాయలలో అనేక ఔషధ గుణాలు ఉన్నాయని డాక్టర్లు చెబుతారు. వేప ఆకుల (Neem leaves) నుంచి ఎండిపోయి చెట్టు వరకు చెట్టు మొత్తం అనేక మనకి అనేక విధాలుగా సహాయ పడుతుంది. వేపలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వేప ఆకులు శరీరానికి హానీకరమైన ప్రీ రాడికల్స్‌తో పోరాడటంతో పాటు ఇమ్యూనిటీ పవర్ ను ఇంప్రూవ్ చేసుకోవడనికి కూడా సహాయ పడుతాయి. శరీరంలోని హానికరమైన ఫ్రీ రాడికల్స్ ను తొలగించడంలో కూడా వేప ఆకులు తోడ్పడతాయి. అలాగే .. రోజూ మనం స్నానం చేసే నీటిలో వేప ఆకులను కలుపుకోవడం ద్వారా అద్బుతమైన చర్మ ప్రయోజనాలు పొందవచ్చు అని నిపుణులు తెలుపుతున్నారు . అవేంటో మనం తెలుసుకుందాం..

నిజానికి వేపలో యాంటీ-ఆక్సిడెంట్లు (Anti-oxidants) బాగా లభిస్తాయి. ఇవి శరీరానికి హాని కలిగించే ఫ్రీ రాడికల్స్‌తో పోరాడటానికి బాగా సహాయపడతాయి. అలాగే రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తుంది. వేప మంచి యాంటీ బ్యాక్టీరియల్ ఏజెంట్‌గా పనిచేస్తుంది. వేప ఆకు నీటితో స్నానం చేయడం వల్ల అనేక చర్మ సమస్యలు అన్ని కూడా తొలిగిపోతాయి. వేప మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. ముఖంపై ఉన్న నల్ల మచ్చలను తొలగించడంలో వేప ఆకులు చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. వేప ఆకులను పేస్ట్ లా చేసి అందులో 2 స్పూన్ల పెరుగు (curd)కలిపి ముఖానికి రాసుకోవాలి. ఇది నల్ల మచ్చలను తొలగిస్తుంది.

మన శరీరంలో బ్యాక్టీరియా ఉత్పత్తి (produced by bacteria) కావడం వల్ల ఎక్కువ చెమట పట్టడం జరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో వేప నీళ్లతో తలస్నానం చేయడం వల్ల చెమట దుర్వాసన తొలగిపోయి చర్మాన్ని కూడా కాపాడుతుంది. వారానికోసారి వేప లేదా వేప ఆకు నీటితో తలస్నానం చేస్తే చుండ్రు పోతుంది. వేప ఆకు నీటిని వాడేటప్పుడు షాంపూ వాడకపోవడమే మంచిది. శరీరంపై బొబ్బలు, అల్సర్లతో బాధపడేవారికి వేప ఆకు నీటి స్నానం ఒక మంచి దివ్యౌషధం. వేప శరీరంపై బొబ్బలు, దద్దుర్లు (Blisters, rashes) సమస్యను వదిలించుకోవడానికి సహాయపడుతుంది.

అలాగే వేప ఆకు నీళ్లతో తలస్నానం చేయడం వల్ల మొటిమల సమస్యలు తొలగిపోయి, ముఖం కాంతివంతంగా (The face is bright)కూడా మారుతుంది. వేప ఆకు నీటితో ముఖాన్ని కడుక్కోవడం వల్ల ముఖానికి సహజమైన మెరుపు కూడా వస్తుంది. వేప ఆకు నీటితో తలస్నానం చేయడం వల్ల చుండ్రు తొలగిపోయి జుట్టు ఆరోగ్యంగా కూడా ఉంటుందట . వేప ఆకులను వేడి నీటిలో కడిగి, రంగు మారే వరకు వడకట్టండి. అనంతరం స్నానం చేసే నీటిలో కలపండి. వారానికి కనీసం రెండు మూడు సార్లు ఈ నీటితో స్నానం చేయండి.