Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Onion Peels: ఉల్లి తొక్కతో లాభాలే లాభాలు

Onion Peels: సాధారణంగా మన వంటగదిలో ఉల్లి (Onion ) ఘుమఘుమలు గుప్పుమని రావాల్సిందే. ఇక వంటలో ఉల్లి పాయ ఉంటేనే రుచినికూడా వస్తుంది. మనలో చాల మంది ఉల్లిపాయలు తినడానికి చాల ఎక్కువగా ఇష్టపడేవారు.. తొక్కే కదా అని వాటి తొక్కలను ఎందుకూ పనిరావని పారేస్తున్నారా.? అయితే ఇది వినండి .. ఉల్లి మాదిరిగానే ఉల్లిపాయ తొక్క కూడా పోషకాల పుష్కలంగా లభిస్తాయి. ఉల్లిపాయ తొక్కల్లో క్యాల్షియం, పొటాషియం, విటమిన్ ఎ, విటమిన్ ఈ, విటమిన్ సిలతో (Calcium, potassium, vitamin A, vitamin E, vitamin C) పాటు యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి.

ముందుగా ఈ ఉల్లిపాయ తొక్కలను కడిగి నీళ్లలో వేసి మరిగించి, ఆ తర్వాత చల్లారిన నీటిని తలకు పట్టించి కాసేపు మసాజ్ చేసి జుట్టును బాగా కడగాలి. దీనితో చుండ్రు సమస్య నుంచి బయట పడవచ్చు. లేకపోతె ఉల్లి తొక్కలను ఉడికించిన నీటిలో కలబందను కలిపి తలకు పట్టించుకోవడం వల్ల చుండ్రు సమస్య పూర్తిగా నయం అవుతుంది. అలాగే జుట్టు రాలడాన్ని కూడా చాల వరుకు తగ్గుస్తుంది. లాగే ఉల్లిపాయ తొక్కను మిక్సీలో మెత్తగా పొడి చేసి, కలబందతో ( aloe vera) కూడా కలపవచ్చు. ఇది జుట్టు ఆరోగ్యాన్ని కూడా బాగా మెరుగుపరుస్తుంది.

నిజానికి ఉల్లిపాయ తొక్కలో విటమిన్లు ఎ, సి, ఈ పుష్కలంగా లభిస్తాయి. కనుక ఇది మన చర్మ ఆరోగ్యానికి చాల మేలు చేస్తుంది. ఉల్లిపాయ తొక్కతో చిటికెడు పసుపు (tumeric) కలిపి.. ఆ పేస్ట్‌లో కొద్దిగా నీరు కలపండి. దీన్ని ముఖానికి పట్టించి 15 నుంచి 20 నిమిషాల పాటు అలాగే ఉంచి.. ఆ తర్వాత ముఖం కడుక్కోవాలి.ఇలా వారానికి రెండుసార్లు వేసుకుంటే ముఖంపై మచ్చలు పూర్తిగా తొలగిపోయి మంచిగా ఉంటుంది పేస్.

ఈ ఉల్లిపాయ తొక్క వాసన ఈగలు, దోమలను (Flies and mosquitoes) తరిమికొడుతుంది. ఇందుకోసం ముందుగా మనం ఉల్లిపాయ తొక్కను నీటిలో నానబెట్టి.. ఆ నీటిని స్ప్రే బాటిల్‌లో ఉంచాలి. ఈ నీటిని ఈగలు, దోమలు ఎక్కువగా ఉండే చోట పిచికారీ చేయడం ద్వారా వాటిని ఈజీగా ఇంట్లో నుంచి బయటకి తరిమికొట్టొచ్చు.