Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

palm rubbing: అరచేతులను రుద్దడం వల్ల ప్రయోజనాలు ఇవే

palm rubbing: మనలో చాల మంది తరచుగా అనారోగ్యంతో ఉన్న వ్యక్తుల చేతులు, కాళ్ళను రుద్దడం చూసి ఉండడం చూస్తూనే ఉన్నాం. కానీ ఇలా చేయడం వల్ల వారి ఆరోగ్యానికి నిజంగా ఏమైనా తేడా వస్తుందా? ఆయుర్వేదమైనా, యోగమైనా, ఈ రెండింటిలోనూ అరచేతులను రుద్దడం ప్రక్రియకు ఒక ముఖ్యమైన స్తానం ఉంది . నిజాన్ని ఆలా అరచేతులను కలిపి రుద్దడం వల్ల వేడి ఉత్పత్తి అవుతుంది. అలాగే శరీరానికి శక్తిని అందిస్తుంది. రక్త ప్రసరణను (blood circulation)పెంచుతుంది. మన చేతులను ఒకదానికొకటి రుద్దడం, ప్రతిరోజూ కొంత సమయం పాటు వాటిని మన కళ్ళపై ఉంచడం ద్వారా మనం పొందే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు (blood circulation) కూడా చాలానే ఉన్నాయి.

అరచేతులను కలిపి రుద్దడం ద్వారా ప్రయోజనాలు విషయానికి వస్తే..ఒక వ్యక్తి అరచేతులలో అనేక ఆక్యుప్రెషర్ పాయింట్లు ఉన్నాయి. ఇవి శరీరంలోని అనేక భాగాలకు అనుసంధానించబడి ఉంటాయి. అటువంటి పరిస్థితిలో చేతులు కలిపి రుద్దడం వలన, చేతుల్లో వేడి, శరీరంలో శక్తి ఉత్పత్తి అవుతుంది. దీని వల్ల శరీరం మొత్తం రక్తప్రసరణ బాగా ఉంటుంది.

అలాగే రెండు చేతులను కలిపి రుద్దడం వల్ల కంటి ఆరోగ్యానికి (eye) చాలా మేలు చేస్తుంది. నిజానికి, అరచేతుల వెచ్చదనం కళ్లపై ఒత్తిడిని తగ్గిస్తుంది. ఇది కళ్ళ చుట్టూ రక్త ప్రసరణను పెంచుతుంది. దీని కారణంగా అలసిపోయిన కళ్ళు నుంచి ఉపశమనం పొందవచ్చు. అలాగే ఇలా అరచేతులను కలిపి రుద్దడం వల్ల రక్తప్రసరణ పెరుగుతుంది. దీని కారణంగా శరీరం వెచ్చగా ఉంటుంది. వ్యక్తి చురుకైన అనుభూతి కూడా పొందవచ్చు. ఆలా చేతులు రుద్దుకున్న తర్వాత కళ్లపై అప్లై చేయడం వల్ల మెదడు పనితీరు కూడా బాగా మెరుగు పడుతుంది.అలాగే మనస్సులో మంచి ఆలోచనలు వస్తాయి. అతను రోజంతా సానుకూలంగా, ఆత్మవిశ్వాసం, హుషారుగా ఉండడానికి కూడా సహాయ పడుతుంది. ఇక చలికాలంలో అయితే చల్లటి చేతులతో (cool hands) రుద్దడం మంచిది. ఆలా చేయడంతో శరీరంలో వేడి ఉత్పత్తి అవుతుంది. దీని కారణంగా అలాంటి వ్యక్తులకు కూడా చలి తక్కువగా ఉంటుందట.