Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Perfume dangers: చర్మంపై పెర్ఫ్యూమ్ స్ప్రే చేస్తున్నారా.. వెరీ డేంజరస్‌..?

Perfume dangers: చాలామందికి బట్టలకు రాసే ఫ్యాగ్రెన్స్‌ (Fragrance)లు అంటే చాలా ఇష్టం. అందుకే చాలా మంది రోజూ పెర్ఫ్యూమ్ వాడతారు. పెర్ఫ్యూమ్‌లు (Perfumes) అనేవి అనేక రకాల రసాయనాలను ఆల్కహాల్‌తో కలిపి తయారు చేస్తారు. పెర్ఫ్యూమ్‌లు చాలా చక్కటి సువాసన కలిగి ఉంటాయి కాబట్టి చాలా మందికి నచ్చుతాయి. కొంతమంది తమ చర్మం మీద నేరుగా పెర్ఫ్యూమ్‌ను పూసుకుంటారు. కానీ నిపుణులు అలా చేయడం వెరీ డేంజరస్ అని హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే, చర్మం మీద నేరుగా పెర్ఫ్యూమ్ పూసుకుంటే చర్మానికి హాని కలిగే అవకాశం ఉంది. అలా చేయడం వల్ల చర్మం ఇన్‌ఫెక్షన్‌కు గురయ్యే ప్రమాదం ఉంది.

పెర్ఫ్యూమ్‌లలో ఉండే ఆల్కహాల్ (Alcohol) చర్మంలోని తేమను తీసివేస్తుంది. దీంతో చర్మం ఎండిపోయి, చాలా పొడిగా మారుతుంది. ఫలితంగా అసౌకర్యం కలుగుతుంది. ఇతర రోగాలు కూడా రావచ్చు. కొంతమందికి పెర్ఫ్యూమ్‌లలో ఉండే రసాయనాలకు అలర్జీ ఉంటుంది. దీని వల్ల చర్మం ఎర్రబడటం, దురద రావడం, ఉబ్బడం వంటి సమస్యలు వస్తాయి. పెర్ఫ్యూమ్‌లు చర్మంపై బ్యాక్టీరియా పెరగడానికి దోహదపడతాయి. దీని వల్ల స్కిన్ ఇన్‌ఫెక్షన్‌కు గురయ్యే ప్రమాదం ఉంది.

పెర్ఫ్యూమ్‌లలో ఉండే కొన్ని రసాయనాలు శ్వాసకోశానికి హాని కలిగిస్తాయి. వీటి వల్ల ఆస్తమా, అలర్జీ వంటి సమస్యలు తీవ్రమవుతాయి. పెర్ఫ్యూమ్‌లలో ఉండే రసాయనాలు శరీరంలోని హార్మోన్లను ప్రభావితం చేస్తాయి. దీని వల్ల చర్మ క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. పెర్ఫ్యూమ్‌లలో ఉండే కొన్ని రసాయనాలు నరాల వ్యవస్థపై ప్రభావం చూపుతాయి. అందుకే ఈ సెంటు బాటిల్స్ స్ప్రే చేసేటప్పుడు చర్మంపై అలాగే ముఖంపై పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే అనారోగ్యాలు కొని తెచ్చుకున్నట్లే అవుతుంది.

కొంతమందికి పెర్ఫ్యూమ్‌ల వల్ల తలనొప్పి, మైకము వంటి సమస్యలు వస్తాయి. పెర్ఫ్యూమ్‌లు కళ్ళ (Eyes)లోకి వెళ్తే చికాకు, నీరు కారడం వంటి సమస్యలు వస్తాయి. కొన్ని పెర్ఫ్యూమ్‌లలో ఉండే రసాయనాలు పురుషులు, స్త్రీలలో సంతానోత్పత్తి సమస్యలకు కారణం కావచ్చు. సింథటిక్ కెమికల్స్ కంటే సహజ పదార్థాలతో తయారైన పెర్ఫ్యూమ్‌లు తక్కువ హానికరం. ఈ సెంట్ చర్మం మీద కాకుండా, దుస్తులపై పూసుకోవాలి. దీన్ని తక్కువ మొత్తంలో వాడాలి.