Raisins Benefits: డ్రై ఫ్రూప్ట్స్ లలో కిస్మిస్ (Raisins) గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. కిస్మిస్ గురించి దాదాపు అందరికీ తెలుసు. మన ఇంట్లో ఎలాంటి స్వీట్లు తయారు చేసినా అందులో కిస్మిస్ (Raisins) వాడుతారు. పరామాన్నం, పాయసం, ఇతర స్వీట్లో కిస్మిస్ వేస్తే కేవలం రుచితో పాటు ఆరోగ్యం కూడా లభిస్తుంది. ఆలా చాలా మంది కిస్మిస్ ని చాలా ఇష్టంగా తింటూ ఉంటారు. అలా కాకుండా నేరుగా తీసుకుంటే మరింత మంచిదని నిపుణులు తెలుపుతున్నారు. ఎందుకు అంటే డ్రై ఫ్రూట్స్‌లో (Dry fruits) కిస్మిస్ కూడా ఒకటి. దీన్ని సూపర్ నట్‌గా పిలుస్తారు. ఇందులో మన శరీరానికి కావాల్సిన పోషకాలు చాల లభిస్తాయి. ఆలాగే పలు అధ్యయనాల ప్రకారం.. కిస్మిస్ తింటే చాలా ఉపయోగాలు లభిస్తాయి అని సమాచారం . అలాగే ఈ కిస్మిస్లను ఉదయం, మధ్యాహ్నం తింటే చాలా మంచిది. ఈ కిస్మిస్లను సరైన సమయంలో తింటే.. అనేక ప్రయోజనాలు పొందుతారు అని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
నిజానికి కిస్మిస్లను (Raisins) ఉదయం పూట తినడం వల్ల మన శరీరంలో రోగ నిరోధక శక్తి బాగా పెరుగుతుంది. కిస్మిస్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి (Antioxidants, vitamin C).. శరీరంలో రోగ నిరోధక శక్తి పెరిగేందుకు బాగా సహాయ పడుతాయి. ఇక మనలో ఇమ్యూనిటీ వ్యవస్థ బలపడటం వల్ల త్వరగా రోగాలు అనేవి రాకుండా ఉంటాయి.అలాగే కిస్మిస్లను ఉదయం పూట తినడం వల్ల అధిక బరువు, ఊబకాయం తగ్గేందుకు బాగా సహాయ పడతాయి. కిస్మిస్లో ఉండే క్యాలరీలు తక్కువగా ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. ఇవి కడుపును నిండిన భావన మనకు కలుగుతుంది, దీంతో ఆహారం ఎక్కువ మోతాదులో కాకుండా చాలా తక్కువగా తీసుకుంటారు. ఇంకా చర్మం అందంగా, ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతీ రోజూ ఉదయం ఓ నాలుగు కిస్మిస్లను నమిలి తినడం వల్ల చర్మం ఫ్రెష్‌గా ఉండడంతో పాటు .చర్మంపై ఉండే ముడతలు, మచ్చలు కూడా దూరముతాయి.
ఇక కిస్మిస్లో (Raisins) అనేక రకాల యాంటీ ఆక్సిడెంట్లు (Antioxidants) ఉండడంతో శరీరంలోని కణాలను నాశనం చేసే ఫ్రీ రాడికల్స్‌ని బయటకు పంపుతాయి. దీంతో క్యాన్సర్ వంటి వ్యాధులు, గుండె జబ్బులు మన దారికి రావు. ఇలా కిస్మిస్లను తినడం వల్ల రక్తంలోని చక్కెర స్థాయిలు కూడా కంట్రోల్ కూడా ఉంటాయి. అలాగే మన శరీరంలో ఉండే వాపు సమస్యల నుంచి కూడా బయట పడవచ్చు.