Reduce Weight Fruits: ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ కూడా ఎదుర్కొంటున్న జీవన శైలి సమస్యల్లోఒకటి అధిక బరువు . ఒక్కసారిగా హఠాత్తుగా బరువు పెరగడం వెనుక నిర్దిష్ట కారణాల్లో.. విటమిన్ (vitamin) లోపం ప్రధాన కారణమని పరిశోధనలు అంటున్నారు. అలాగే అమెరికన్ కాలేజ్ ఆఫ్ న్యూట్రిషన్ జర్నల్‌లో ప్రచురించబడిన అధ్యయనం తెలిపిన వివరాల ప్రకారం.. మానవ శరీరంలో విటమిన్ సి లోపం బరువు పెరుగుటకు దారితీస్తుందని తెలిపారు.
అందు కొరకు ఫిట్ లుక్ పొందాలంటే ప్రతిరోజూ విటమిన్ సి (vitamin) ఉన్న ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవడం మంచిది. ముఖ్యంగా ఈ విటమిన్స్ లభించే పండ్లు తీసుకుంటే బరువు చాల సులువుగా తగ్గుతారు. అలాగే నవ యవ్వనం కూడా మీసొంతం అవుతుంది. ఇక పైనాపిల్‌లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. ఇది ఆహారం జీర్ణం కావడానికి కూడా సహాయపడుతుంది. అలాగే ఈ పండు రోగనిరోధక శక్తిని పెంచుతుంది.అలాగే మన శరీరంలో మంటను కేసుల సులువుగా తగ్గిస్తుంది. ఇక బొప్పాయి పండులో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ ఇ అధికంగా లభిస్తాయి. బొప్పాయిలోని (papaya) ఈ గుణం శరీరంలో మంటను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. గుండె సంబంధిత వ్యాధులను నివారించడంలో ఈ ఫ్రూట్ కాంబినేషన్ బలేగా ఉంటుంది. బరువు కూడా చాల సులువుగా తగ్గొచ్చు.
కివిపండు అధిక ఫైబర్ పండు. ఇది అన్ని సీజన్లలో అందుబాటులో ఉంటుంది.పైగా ఫైబర్ బరువు తగ్గడానికి గ్రేట్ గా సహాయపడుతుంది. కివీలోని విటమిన్ సి గుండె జబ్బుల ప్రమాదాన్ని కేసుల బాగా తగ్గిస్తుంది. కివిపండు (Kiwifruit) రక్తపోటును తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. అలాగే జామపండు విటమిన్ (vitamin) సి మాత్రమే కాకుండా ఖనిజాలు, పొటాషియం, ఇతర మూలకాలను కలిగి ఉన్న పండు అనే చెప్పాలి. జామపండు శరీర పోషణలో ఎంతో సహాయపడుతుంది. అలాగే మన రోజువారీ ఆహారంలో స్ట్రాబెర్రీలను తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. స్ట్రాబెర్రీలో (strawberry)పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇది రక్తంలో చక్కెర నియంత్రణలో ముఖ్య పాత్ర పోషిస్తుంది.