Rose Water: గులాబీ పువ్వుల సువాసన, అందం అందరికీ తెలుసు కదా? ఈ పువ్వులను నీటిలో నానబెట్టి తయారు చేసే ద్రవాన్ని రోజ్ వాటర్ అంటారు. చాలా కాలంగా, అనేక దేశాల్లో ఈ రోజ్ వాటర్‌ను అందం, ఆరోగ్యం కోసం ఉపయోగిస్తున్నారు. ఇది చర్మానికి చల్లదనాన్ని ఇస్తుంది. ముఖ్యంగా ఎండలో ఎక్కువ సేపు తిరిగి వచ్చినప్పుడు లేదా ఏదైనా అలర్జీ వల్ల చర్మం (Skin benefits) ఎర్రబడినప్పుడు, రోజ్ వాటర్‌తో ముఖం కడిగితే చల్లదనం లభిస్తుంది.
రోజ్ వాటర్‌లో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచి, మెరుస్తుండేలా చేస్తాయి.
రోజ్ వాటర్ చర్మాన్ని బిగుతు చేసి, ముఖం తాజాగా కనిపించేలా చేస్తుంది. రోజ్ వాటర్‌ను తాగితే సులభంగా ఆహారం డైజెస్ట్ (Digestive aid) అవుతుంది. గ్యాస్ ఎక్కువగా ఏర్పడి ఉబ్బరం వచ్చినప్పుడు, కూడా ఇది ఉపశమనం కలిగిస్తుంది. కొన్ని సందర్భాల్లో, రోజ్ వాటర్ మలబద్ధకం నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
గులాబీ పూల సువాసన ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. గులాబీ జలాన్ని ఉపయోగించినప్పుడు ఈ సువాసన మన మనసును ప్రశాంతంగా చేసి, ఒత్తిడిని తగ్గిస్తుంది. స్నానం (Bathing) చేసే నీటిలో కొన్ని చుక్కలు రోజ్ వాటర్‌ను కలిపి స్నానం చేస్తే లేదా డిఫ్యూజర్‌లో వేసి వాసన చూస్తే, మనం చాలా రిలాక్స్‌గా ఫీల్ అవుతాము.
ఈ వాటర్‌లో విటమిన్ ఎ, సి, ఈ లాంటి చాలా మంచి విటమిన్లు (Vitamins) ఉంటాయి. ఈ విటమిన్లు మన శరీరాన్ని రక్షించడానికి సహాయపడతాయి. అంతేకాదు, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం లాంటి ఖనిజాలు కూడా ఉంటాయి. ఇవి మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి చాలా ముఖ్యమైనవి.
గులాబీ జలంలో ఇన్‌ఫ్లమేషన్ తగ్గించే (Anti-inflammatory) గుణాలు ఉన్నాయి. మన శరీరంలో ఎక్కడైనా వాపు లేదా అలర్జీ వచ్చినప్పుడు, గులాబీ జలం దాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది. ఉదాహరణకు, ఆర్థరైటిస్, గౌట్ వంటి వ్యాధుల వల్ల కలిగే నొప్పులు తగ్గించడంలో ఈ వాటర్ చాలా బాగా పనిచేస్తుంది.