Salt:ప్రస్తుతం ఉన్న ఉరుకు పరుగు జీవితంలో అనేక మంది వివిధ రకాల వ్యాధులతో బాధపడుతూ ఉన్నారు. అలాగే మనం తీసుకునే ఆహారం కారణంగా కూడా అనేక అనారోగ్య సమస్యలకు ఒక కారణమని చెప్పాలి. అయితే నిత్యం వంటకాలలో ఉపయోగించే పదార్థం ఉప్పు. మనం చేసే ఏ వంటకాలు అయినా కానీ ఉప్పు ఖచ్చితంగా వాడాల్సిందే. ఉప్పు (Salt) లేకపోతే ఆ వంటకానికి రుచి కూడా ఉండదు. అయితే ఉప్పు తగినంత మోతాదులో తీసుకుంటే ఎటువంటి ప్రమాదం ఉండదు కానీ … పరిమితి మించి ఎక్కువ మోతాదులో తీసుకుంటే మాత్రం అనేక ఆరోగ్య సమస్యలు (Health problems) వస్తాయని డాక్టర్ తెలియచేస్తున్నారు.
అధిక మోతాదులో ఉప్పు (salt) తీసుకోవడం వల్ల బిపి, గుండెపోటు, కిడ్నీ సమస్యలు (BP, heart attack, kidney problems) వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని డాక్టర్స్ తెలిపారు. ఈ తరుణంలో నిత్యం మనం తగినంత మోతాదు కంటే ఎక్కువగా తీసుకుంటే మన శరీరంలో పలు లక్షణాలు కూడా కనపడతాయని వారు తెలుపుతున్నారు. ఈ లక్షణాలను బట్టి మనం ఉప్పు ఎక్కువ తీసుకుంటున్నామా లేదా తక్కువ తీసుకుంటున్నామా అనేది ఇట్టే కనిపెట్టవచ్చు. అలాగే మనం ఎక్కువగా ఉప్పు తీసుకుంటే మూల విసర్జన కూడా ఎక్కువసార్లు వచ్చే ప్రమాదం ఉంటుంది. వాసవానికి ఉప్పులో ఉండే సోడియం శరీరం బయటకు పంపేందుకు నీటిని ఎక్కువగా ఉపయోగపడుతుందట. అందుకోసమే ఉప్పు ఎక్కువ శాతం తీసుకుంటే తరచు మూత్రం వస్తోంది. ఇలాంటి లక్షణాలు ఏమైనా ఉంటే ఉప్పు శాతాన్ని తగ్గించుకుంటే మంచిది అని డాక్టర్స్ అంటున్నారు.
అలాగే ఉప్పు ఎక్కువ తీసుకునే వారికి శరీరంలో (bosy) వాపులు కూడా వస్తాయట. ముఖ్యంగా కాలి మడమ భాగంలో ఉబ్బిపోతుంది. ఆ ప్లేస్ మనం వేలు కానీ పెడితే చర్మం (skin) లోపలికి వెళ్ళిపోతుంది. దానికి కారణం ఆ భాగంలో నీరు ఎక్కువగా ఉండిపోవడమే. ఇక ఈ సమస్య నుంచి బయటపడాలంటే ఊపును తగ్గిస్తే మంచిది అని డాక్టర్స్ అంటున్నారు. ఇక అంతే కాకుండా ఉప్పు ఎక్కువ మోతాదులో తీసుకునే వారికి డిహైడ్రేషన్ భారిన త్వరగా పడతారు. దీనితో వెంటనే వారికి తలనొప్పి (head ace)కూడా వస్తుంది. ముఖ్యంగా ఈ వేసవికాలంలో శరీరం సహజంగానే డిహైడ్రేషన్ మారిన పడుతుంది అలాగే ఉప్పు ఎక్కువ మోతాదులో తీసుకుంటే త్వరగా డిహైడ్రేషన్ మారినపడి ఎండ దెబ్బ కూడా కూర ఏ అవకాశం ఉంది. సాధ్యమైనంత వరకు ఉప్పు (salt) తగిన మోతాదులో తీసుకోవడం మంచిది అని డాక్టర్ తెలియచేస్తున్నారు.