Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Sapota Fruit: సపోటా పండ్లు తినడం వల్ల కలిగే లాభాలు ఇవే

Sapota Fruit: మన ప్రకృతిలో లభించే ప్రతి పండు మనిషి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందని చాలా మందికి తెలిసిన విషయమే. కానీ, మనలో చాల మంది పండ్ల విషయంలో నిర్లక్ష్యంగా ఉంటూ వాటిని తినడం మానేస్తారు. మర్కెట్స్ నుంచి తెచ్చిన పండ్లు, వారాల తరబడి కళ్లముందు కనిపిస్తున్నా, వాటిని తినడం పూర్తి చేయాలనే ఆలోచన కూడా ఉండదు. చివరకు అ పండ్లు కాస్త కుళ్లిపోతే వాటిని డస్ట్ బిన్ లో వేసి చేతులు దులిపేసుకుంటారు. కానీ, ఇలా చేయటం వారి ఆరోగ్యానికే ప్రమాదం అని మర్చిపోతున్నారు. నిజానికి ప్రతి సీజనల్‌లో లభించే అన్ని రకాల పండ్లను తప్పనిసరిగా తినడం మంచిది అని పోషకాహార నిపుణులు తెలుపుతున్నారు. అందులో సపోటా కూడా ఒకటి. ఈ పండ్లు తినడం వల్ల శరీరానికి అనేక లాభాలు చేకూరుతాయి. అంతేకాదు.. ఇందులో ఉండే పోషకాలు, ఇతర విటమిన్స్‌ అనేక సమస్యల నుంచి మనల్ని బయట పడేసాతయి. అంతే కాకుండా దీర్ఘకాలిక వ్యాధులను (Chronic diseases) కూడా విముక్తి పొందవచ్చు. మనం ఇప్పుడు సపోటాతో (sapota) కలిగే లాభాలు చూద్దాం..

నిజానికి సపోటా (sapota) పండ్లలో శరీరానికి కావాల్సిన అనేక రకాల పోషకాలు ఉంటాయి. ఇందులో విటమిన్ A ఎక్కువ మోతాదులో ఉండడంతో చర్మం, కళ్ళ ఆరోగ్యాన్ని మెరుగుపరిచేలా ఉంచుతుంది.సపోటా పండ్లలో విటమిన్ C, విటమిన్ B కాంప్లెక్స్, ఖనిజాలు, (Vitamin C, vitamin B complex, minerals)పొటాషియం పుష్కలంగా లభిస్తాయి. ఇవి శరీరానికి శక్తిని అందించడమే కాకుండా రక్తపోటు సమస్య నుంచి బయట పడేస్తుంది.

ఇక సపోటాలో (sapota) కాల్షియం, మాగ్నీషియం, పొటాషియం వంటి ఖనిజాలు కూడా పుష్కలంగా లభిస్తాయి. వీటి వాళ్ళ ఎముకలను దృఢంగా చేసేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. దీంతో పాటు ఇతర ఎముకల నుంచి వచ్చే సమస్యలను తగ్గించేందుకు కూడా సహాయపడుతుంది. ఇకసపోటాలో ఉండే ఫైబర్, ఫాస్పరస్, కాల్షియం కూడా లభిస్తాయి.

సపోటాలో (sapota) ఉండే ఫ్రక్టోజ్ శరీరానికి తక్షణ శక్తిని మనకి ఇస్తుంది. అంతేకాదు అలసట, నీరసం వంటి సమస్యలను నుంచి తగ్గించేందుకు కూడా ఎంతగానో సహాయపడుతుంది. అలాగే రోగనిరోధక శక్తిని పెంచేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుంది. సపోటాలో ఫైబర్ పుష్కలంగా ఉండటం వల్ల మనకి జీర్ణక్రియ మెరుగుపడుతుంది.వాస్తవానికి యాపిల్, ఆరెంజ్ (Apple, orange) కంటే ఎక్కువగా ఉండే ఈ పండులో విటమిన్ సి ఉండటం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తిని (Immunity)పెంచి చర్మ సంబంధిత సమస్యల నుంచి బయట పడేస్తుంది.