Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

silverware: వెండి కంచంలో తింటే లాభాలే లాభాలే

silverware: సాధారంణగా వెండిపాత్ర‌ల్లో (silverware) భోజ‌నం చేస్తే ఆరోగ్యానికి పుష్కలమైన ప్రయోజనాలు అందుతాయని నిపుణులు అంటున్నారు. ఇక వెండి పాత్ర లేదంటే.. వెండి స్పూన్ తో తిన్నా కూడా.. మన శరీరంలో రోగనిరోధక శక్తి కూడా బాగా పెరుగుతుంది. ఇక ఇమ్యూనిటీ పవర్ పెరగడం వల్ల ఇన్ఫెక్షన్లు, ఏవైనా వ్యాధులు (Infections, any diseases) ఉన్నా వాటిని తగ్గించడంలో బాగా సహాయపడతాయి. వెండి పాత్రల్లో భోజనం చేయడం వల్ల (Because of eating)మనకు జీర్ణ సమస్యలు రాకుండా కూడా సహాయ పడుతుంది. ఆలా తిన్నది ఈజీగా జీర్ణం అవుతుంది. ఇక వెండి పాత్రల్లో భోజనంతో మన బాడీని చాలా కూల్ గా ఉంచుతుంది. మెంటల్ హెల్త్ ఇంప్రూవ్ కూడా అవుతుంది.

ఇక వెండి స‌హ‌జ‌సిద్ధ‌మైన యాంటీ బాక్టీరియ‌ల్ (Antibacterial) ల‌క్ష‌ణాల‌ను క‌లిగి ఉండడమే మెయిన్ గా.. మ‌న‌కు రోగ నిరోధ‌క శ‌క్తి పెరగడంలో సహాయ పడుతుంది . దీంతో వ్యాధులు, ఇన్‌ఫెక్ష‌న్ల నుంచి ర‌క్ష‌ణ ల‌భిస్తుంది. వెండిలో యాంటీ బాక్టీరియల్, యాంటీ మైక్రోబయల్ ఉంటాయి. అలాగే మన శరీరంలో హానికరమైన బ్యాక్టీరియాను తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. చాలా రకాల ఇన్ఫెక్షన్లు తగ్గించడానికి కూడా సహాయపడుతుంది.ఇంకా కంటి వ్యాధులు, ఎసిడిటీ, శరీర చికాకులను తొలగించడంలో కూడా ఇది బాగా సహాయపడుతుంది.శరీరంలో చక్కెర స్థాయిని నియంత్రించడానికి కూడా ఇది సహాయపడుతుంది.

వెండిలో ఉండే యాంటీ ఇన్ఫ్లేమటరీ ప్రాపర్టీలు (Anti-inflammatory properties) ఉంటాయి. ఇవి.. మన బాడీలో ఇన్ ఫ్లమేషన్ తగ్గడానికి సహాయపడుతుంది. ఆర్థరైటిస్ వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. సిల్వర్ అయాన్లు శరీరంలోని బ్యాక్టీరియా పై కూడా దాడి చేస్తాయి.ఇక వెండి పాత్రలో ఆహారం తీసుకుంటే జలుబు, ఫ్లూ నుంచి కూడా రక్షణ గా ఉంటుంది.ఇది వ్యాధికారక వైరస్ లపై పోరాడేందుకు కూడా ఉపయోగ పడుతుంది. అలాగే సిల్వర్ (silver) వస్తువులలో భోజనం చేయడం వల్ల ఆహారం రుచిని కూడా పెంచుతుంది. భోజనానికి మంచి సహజమైన ఫ్లేవర్, అరోమా తీసుకువచ్చి… మనం ఫుడ్ ని ఎంజాయ్ చేయడానికి కూడా ఉంటుంది..