Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

soaked peanuts: వేరుశనగ గింజల ప్రయోజనాలు ఇవే

soaked peanuts: ప్రస్తుత రోజులలో చాలా మంది నానబెట్టిన బాదంపప్పులను ఉదయాన్నే తీసుకుంటూ వారి ఆరోగ్యాన్ని అదుపులోకి పెట్టుకుంటూ ఉంటారు. బాదంపప్పులో ఉండే పోషకాలు సాధారణంగా మంచి ప్రయోజనాలను పొందవచ్చు. ఈ క్రమంలో నానబెట్టిన వేరుశనగల (soaked peanuts)వల్ల కూడా అనేక ప్రయోజనాలు ఉన్నాయని మీకు తెలుసా.. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం..

వేరుశెనగ గింజలు(Groundnut seeds) ఆరోగ్యానికి చాలా మేలు కలిగిస్తాయి . ప్రతిరోజు వేరు శనగలు కొద్ది మోతాదులో తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు పొందుతారు. నా నీళ్లలో నానబెట్టి తీసుకుంటే మాత్రం అనేక ప్రయోజనాలను పొందవచ్చు. అందులో ముఖ్యంగా నానబెట్టిన వేరుశనగలు తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి బాగా సహాయపడుతుంది. అలాగే ప్రతిరోజు కూడా వేరుశనగలు తీసుకోవడం వల్ల రక్త ప్రసరణ అదుపులో ఉండడంతో పాటు గుండెపోటు ప్రమాదం నుంచి కూడా బయటపడవచ్చు. అలాగే ఈ క్రమంలో నానబెట్టిన వేరుశనగలతో బెల్లం కలుపుకొని తింటే కీళ్ల నొప్పులు, వెన్నునొప్పుల (Joint pain, back pain)నుండి సులువుగా బయటపడవచ్చు.

అలాగే నానపెట్టిన వేరుశనగలను ప్రతిరోజు ఉదయం ఖాళీ కడుపుతో తింటే ఎసిడిటీ ,గ్యాస్ సమస్య నుండి సులువుగా బయటపడవచ్చు. ఇక వేరుసెనగలలో ఉండే యాంటీఆక్సిడెంట్లు, ఐరన్, ఫోలేట్, కాల్షియం, జింక్ (Antioxidants, iron, folate, calcium, zinc) శరీరాన్ని క్యాన్సర్ కణాల నుండి దూరంగా ఉంచడంతోపాటు గుండె జబ్బులు రాకుండా సహాయపడుతుంది.వేరుశనగలు నానబెట్టినప్పుడు అవి ఫైట్ యాసిడ్ వంటి సమ్మేళనాలు ఇచ్ఛనం చేయడంతో బాగా సహాయపడతాయి దీంతో సులభంగా జీర్ణం జీర్ణ సమస్యల నుంచి బయటపడవచ్చు. అలాగే మధుమేహంతో బాధపడే వరకు ఇది ఒక అద్భుతంగా పనిచేస్తుందని చెప్పవచ్చు. కనుక ఇప్పటినుండి నాన్న పెట్టిన వేరుశనగలను తినడం వల్ల అనేక పోషక ప్రయోజనాలు కూడా పొందవచ్చు కాబట్టి రోజువారి డైట్లోకి నానబెట్టిన వేరుసెనగలు జత చేసుకుంటే చాలా మంచిది.