Sugandhi Root: మీరు ఎప్పుడైనా సుగంధ పాల వేర్లు (Sugandhi Root)అని ఎప్పుడైనా విన్నారా.. అలాగే వాటి ఉపయోగాల గురించి తెలిస్తే మాత్రం అసలు వదలరు. వీటి వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలను నయం చేయడంలో బాగా సుగంధి పాల మొక్క అద్భుతం చేస్తుంది అనే చెప్పాలి. అలాగే మన శరీరానికి చలువ చేయడంతో పాటు సుగంధ పాల వేర్లు (Sugandhi Root) అనేక ఇతర ఔషధ గుణాలను కలిగి ఉన్నాయి అని ఆరోగ్య నిపుణులు తెలుపు తున్నారు . ఆలాగే ఇందులో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ గుణాలు (Anti-bacterial and anti-viral properties)పుష్కలంగా లభిస్తాయి. ఇక సుగంధి పాల మొక్క వేరు చక్కని సువాసనను ఉంటుంది. ఈ వేరును శుభ్రంగా కడిగి నీటిలో వేసి మరిగించగా ఎర్రని కషాయం తయారవుతుంది. ఈ కషాయాన్ని తాగడం వల్ల శరీరానికి మంచి బలం లభిస్తుంది.
మనకు ఆయుర్వేద షాపుల్లో ఈ సుగంధి పాల వేర్లు సేల్ చేస్తూ ఉంటారు . ఇందులో అనేక రకాలుగా ఉంటాయి. ఒకటి నల్ల సుగంధి, ఎర్ర సుగంధి, దేశీయ సుగంధి (Black spice, red spice, domestic spice) ఇలా అనేక రకాలు మార్కెట్ లో ఉన్నాయి. ఈ సుగంధి వేర్లతో కషాయాన్ని తయారు చేసి తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు మనకి వస్తాయి. అలాగే శరీరంలో ఉండే వేడి అంతా పోయి చలువ చేస్తుంది. అధిక వేడితో బాధపడేవారు ఈ కషాయాన్ని తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అధిక వేడి వల్ల కలిగే అనారోగ్య సమస్యల బారిన పడకుండా చేస్తుంది. సుగంధి పాల మొక్క వేరు కషాయాన్ని తాగడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరిగి రోగాల బారిన పడకుండా ఉండెను కూడా సహాయ పడుతుంది. సుగంధి పాల వేర్ల కషాయాన్ని తాగడం వల్ల ఆకలి పెరుగుతుంది. జ్వరం వచ్చినప్పుడు ఈ కషాయాన్ని తాగడం వల్ల జ్వరం త్వరగా తగ్గుతుంది.
అలాగే సుగంధి పాల (Sugandhi Root) మొక్క వేరును కడిగి నేరుగా నోట్లో పెట్టుకుని నమిలి రసాన్ని మింగవచ్చు. సుగంధి పాల మొక్క వేరు కషాయాన్ని తాగడం వల్ల కీళ్ల నొప్పులు కూడా నయం అవుతుంది . చర్మం ఆరోగ్యంగా ఉండడంతోపాటు కాంతివంతంగా కూడా చేస్తుంది. శరీరంలో రక్త ప్రసరణ సాఫీగా జరుగుతుంది. సుగంధి వేర్లతో తయారు చేసిన కషాయాన్ని తీసుకోవడం వల్ల మనం ఇన్పెక్షన్ ల బారిన పడకుండా ఉంటాము. సుంగధ వేర్లతో చేసిన కషాయాన్ని తీసుకోవడం వల్ల రక్తం శుభ్రపడుతుంది. శరీరంలో వేడి తగ్గడంతో పాటు జీర్ణశక్తి మెరుగుపడుతుంది. ఈ కషాయాన్ని తాగడం వల్ల మూత్రాశయ ఇన్పెక్షన్ లు కూడా మన దరి చేరకుండా ఉంటాయి. ఈవిధంగా సుగంధ వేర్లు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని వీటిని వాడడం వల్ల మనకు ఎంతో మేలు కలుగుతుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.
ఇక సుగంధ వేర్లతో (Sugandhi Root) కషాయాన్ని తయారు చేసుకోవడానికి మనం ముందుగా 4 లేదా 5 గ్రాముల సుగంధ వేర్ల బెరడు పొడి, 4 మిరియాలను, 2 యాలకులను, ఒక చిన్న అల్లం ముక్కను, 10 పుదీనా ఆకులను వాడాల్సి ఉంటుంది. ముందుగా ఒక గిన్నెలో రెండు కప్పుల నీళ్లు పోసి అందులో సుగంధ వేర్ల పొడి, అల్లం, మిరియాలు, యాలకులు వేసి నీటిని బాగా మారగా పెట్టాలి .అనంతరం నీళ్లు మరిగిన తరువాత వడకట్టి అందులో పుదీనా ఆకులు, తేనె వేసి కలిపి తాగాలి. ఇలా రోజుకు రెండు లేదా మూడు సార్లు తీసుకోవడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోండి.