Soybeans: సాధారణంగా బరువు తగ్గాలంటే తక్కువగా తినాలి అని చాలామంది భావిస్తారు. కానీ నిజానికి ఏం తింటున్నాం అన్నది వెయిట్ మేనేజ్మెంట్ (Weight management) విషయంలో కీలక పాత్ర పోషిస్తుంది. మన శరీరం బాగా పని చేయాలంటే ప్రోటీన్లు (Proteins) చాలా అవసరం. ప్రోటీన్లు శరీరానికి నిర్మాణ సామగ్రి లాంటివి. ప్రోటీన్లు తింటే ఎక్కువ సేపు ఆకలి వేయదు. అంటే, మనం తక్కువగా తింటాం. కండరాలను పెంచుకోవడానికి ప్రోటీన్లు చాలా ముఖ్యం. మజిల్స్ పెద్దగా ఉంటే, శరీరం ఎక్కువ కేలరీలు ఖర్చు చేస్తుంది.
మాంసం, చికెన్, చేపలు, గుడ్లు ఇవన్నీ ప్రోటీన్లకు మంచి ఆహారాలు. పాలు, పెరుగు, పనీర్, బీన్స్, సోయాబీన్లు ఇవన్నీ ప్రోటీన్లు కలిగి ఉంటాయి. ముఖ్యంగా, సోయాబీన్స్ (Soybeans) శరీరానికి అవసరమైన అన్ని రకాల ప్రోటీన్లను అందిస్తాయి. ఇవి తింటే బరువు తగ్గవచ్చు. ఇవి శరీరానికి ఇంకా చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు (Health benefits) ఆఫర్ చేస్తాయి. అవేవో తెలుసుకుందాం.
సోయాబీన్లలో ప్రోటీన్లు పుష్కలంగా లభిస్తాయి. అందుకే వీటిని తింటే కడుపు నిండిన భావన కలుగుతుంది. సోయాబీన్లలో చక్కెర తక్కువ. చక్కెర ఎక్కువగా తింటే లావైపోతాము కానీ సోయాబీన్లు ఎంత తిన్నా పెద్దగా లావు కాము. సోయాబీన్లలో చెడు కొవ్వు తక్కువ. చెడు కొవ్వు శరీరంలో చేరితే అనారోగ్య సమస్యలు వస్తాయి.
సోయాబీన్లలో పీచు పదార్థాలు (Fiber) ఎక్కువగా ఉంటాయి. ఈ పీచు పదార్థాలు ఆహారాం సరిగా డైజెస్ట్ అయ్యేలా చేస్తాయి. అంతేకాకుండా మలబద్ధక సమస్యను పోగొడతాయి. ఈ బీన్స్‌లో విటమిన్లు, ఖనిజాలు అలాగే యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యాన్ని కాపాడతాయి. వీటిలో కేలరీలు కూడా తక్కువే. కానీ పోషక విలువలు ఎక్కువ.
సోయాబీన్స్‌లో శాచురేటెడ్ ఫ్యాట్, కొలెస్ట్రాల్ తక్కువగా ఉంటాయి, అంటే ఈ గింజలు తింటూ గుండె ఆరోగ్యాన్ని పొందించుకోవచ్చు. కొన్ని అధ్యయనాలు సోయాబీన్స్ తినడం వల్ల గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి కొన్ని వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించవచ్చని సూచిస్తున్నాయి. ఈ బీన్స్‌లో ఫైటోఈస్ట్రోజెన్లు ఉంటాయి, ఇవి ఎముకల ఆరోగ్యాన్ని కాపాడటంలో సహాయపడతాయి. సోయా మిల్క్ కూడా ప్రోటీన్, కాల్షియంకు మంచి మూలం.