Walnuts: మన భారతదేశంలో ప్రతి ఏడాది గుండెపోటు కారణంగా అధిక సంఖ్యలో ప్రజలు వారి ప్రాణాలను కోల్పోతున్నారు.. కనుక ఈ ప్రాణాంతక వ్యాధి నుంచి మనం ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండడం మంచిది. మన భారతదేశంలో చాలా వరుకు ప్రజలు ఎక్కువ నూనె, అనారోగ్యకరమైన ఆహారాన్ని తీసుకుంటూ ఉండడం మనం చూస్తూనే ఉంటాం. ఇది రుచికరంగా ఉండవచ్చు.. కానీ గుండె ఆరోగ్యానికి చాలా హాని తలపెడుతుంది . అలాగే కొవ్వును కూడా పెంచడంతోపాటు..అలాగే బీపీ.. గుండె సమస్యలను కలిగిస్తుంది. ఇలాంటి పరిస్థితిలో వాల్ నట్స్ తినడం ద్వారా గుండె జబ్బుల ప్రమాదం నుంచి బయట పడవచ్చు.. వాస్తవానికి వాల్నట్స్లో (Walnuts) ఫైబర్, విటమిన్ ఇ, ఫోలేట్, మెగ్నీషియం, పాస్పరస్ (Fiber, Vitamin E, Folate, Magnesium, Phosphorus)వంటి ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా లభిస్తాయి కనుక రోగనిరోధక శక్తి పెంచడంలో, ఎముకలను ఆరోగ్యంగా ఉంచడంలో కూడా బాగా సహాయపడతాయి..
అయితే వాస్తవానికి ప్రతి డ్రై ఫ్రూట్ (Dry fruit)తినడం ఆరోగ్యానికి ప్రయోజనకరమే.. అయినప్పటికీ, మీరు వాల్నట్లను (Walnuts) తీసుకుంటే అది గుండె ఆరోగ్యానికి ఔషధం కంటే తక్కువ ఏం కాదు.. కానీ గుండె మన శరీరంలో చాలా ముఖ్యమైన భాగం.. దానిని ఆరోగ్యంగా ఉంచడానికి శరీరంలో ఎలాంటి పోషకాల కొరత ఉండకూడదు.. అందుకే వాల్నట్స్ తీసుకోవడం చాలా మంచి దంటున్నారు వైద్య నిపుణులు.. అయితే.. వాల్ నట్స్ ఎలా మేలు చేస్తాయి.. ఎలాంటి హాని కలిగిస్తాయో మనం ఇప్పడే చూడం
వాల్నట్లు స్టెరాల్స్, మొక్కల ఆధారిత ఒమేగా-3 కొవ్వు ఆమ్లాల గొప్ప మూలంగా వాడుకుంటారు. అలాగే కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్న లినోలెనిక్ ఆమ్లం కూడా ఇందులో పుష్కలంగా లభిస్తాయి. ఇక మన రక్తనాళాల్లో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే, అది మొదట రక్తపోటును పెంచి, ఆపై గుండెపోటు వంటి గుండె సంబంధిత వ్యాధులకు దారితీస్తుందని గమనించండి. ఇక ముఖ్యంగా శాకాహారులు వాల్నట్ల వినియోగం ద్వారా అనేక ప్రయోజనాలను పొందవచ్చు.. అందుకు గల కారణం ఏమిటంటే ఒమేగా -3, 6 ఫ్యాటీ యాసిడ్ల(Omega-3, 6 fatty acids) రోజువారీ అవసరాలు దాని ద్వారా నెరవేరుతాయి.
నిజానికి వాల్నట్స్లో (Walnuts) పోషకాలకు కొరత లేదు.. ఫైబర్, విటమిన్ ఇ, ఖనిజాలు, ఆరోగ్యకరమైన కొవ్వులు ఇందులో ఉంటాయి. వాల్నట్స్ తినడం వల్ల గుండెపోటు రాకుండా ఉండటమే కాకుండా టైప్ 2 డయాబెటిస్ నిర్వహణలో కూడా ఒక ముఖ్యమైన విషయం అనే చెప్పాలి. అయితే గుండె జబ్బు తో బాధ పడే వారు మాత్రం వాల్నట్లను 2 నుంచి 4 ముక్కలు మాత్రమే తీసుకోవాలి . అంత కంటే ఎక్కువగా తింటే, కేలరీలు పెరుగుతాయి..మనకి కూడా ప్రయోజనాలకు బదులుగా హాని కలగవచ్చు అని డాక్టర్లు అంటున్నారు.