Winter Health Care: అద్భుతమైన ఆరోగ్య చిట్కా, చలికాలంలో ఉదయాన్నే నిమ్మ రసం తాగితే కలిగే అద్భుతమైన ప్రయోజనాలు
ప్రజా దీవెన, హైదరాబాద్: చలికాలంలో మనకు సీజనల్ వ్యాధులు అనేకం వస్తుంటాయి. దగ్గు, జలుబు, ముక్కు దిబ్బడ ఈ సీజన్‌లో మనల్ని ఇబ్బందులకు గురిచేస్తుంటాయి. కాస్తంత చల్లని నీళ్లను తాగినా చాలు వెంటనే ము క్కు దిబ్బడ వచ్చేస్తుంది. అలాగే దగ్గు కూడా వస్తుంది. ఈ సీజన్‌లో మన ఇమ్యూనిటీ పవర్ కూడా తగ్గుతుంది.
దీనికి తోడు ఎండ తక్కువ ఉంటుంది కనుక మనకు విటమిన్ డి కూడా చాలా తక్కువ గా లభిస్తుంది. అయితే ఈ సీజన్ లో వచ్చే అన్ని సమస్యలకు చెక్ పెడుతూ ఆరోగ్యంగా ఉండాలంటే అందుకు నిమ్మరసం తాగాలని వైద్యులు సూచిస్తున్నారు. రోజూ ఉదయం ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో అర టీస్పూన్ నిమ్మరసం కలిపి తాగితే ఎన్నో లాభాలను పొందవచ్చని వారు అంటున్నారు. చలికాలంలో ఈ విధంగా కచ్చి తంగా తాగాలని వారు సూచి స్తున్నారు.
మన శరీరంలో లివర్ అనేక కీలక విధులను నిర్వహి స్తుంది. లివర్ సుమారుగా 800 పైగా జీవక్రియలను నిర్వహిస్తుంది. అయితే చలికాలంలో లివర్ పని తీరు మందగిస్తుంది. దీంతో వ్య ర్థాలు, కొవ్వు పేరుకుపోతాయి. దీంతో లివర్ వ్యాధులు సాధ్య మైనంత వరకు తగ్గుతాయి