Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Amla juice: రోజూ ఉసిరి రసం తాగడం వల్ల కలిగే లాభాలు ఇవే ..!

Amla juice: మన శరీరంలో కొలెస్ట్రాల్ (Cholesterol)ఎక్కువగా ఉంటే మనకి అనేక సమస్యలొస్తాయి. అందుకే శరీరంలోని కొలెస్ట్రాల్ ను తగ్గించుకోవాలి. అందుకోసం ఉసిరిని జ్యూస్‌లా చేసి తాగడం వల్ల కొలెస్ట్రాల్ సమస్య తగ్గుతుందని డాక్టర్లు చెబుతున్నారు. అయితే, ఉసిరి రసం ఎలా చేసుకోవాలి ,అలాగే దీంతో కలిగే లాభాల గురించి మనం ఇప్పడూ చూద్దాం..

ఉసిరిలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు (Vitamin C, antioxidants) అధికంగా ఉంటాయి అవి మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే ఉసిరి యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణం శరీరంలో వాపును తగ్గిస్తుంది. కీళ్ల నొప్పులను దూరం చేస్తుంది. ఇది గ్యాస్ట్రిక్ రసాలను ప్రేరేపిస్తుంది. పోషకాల శోషణను మెరుగుపరుస్తుంది, జీర్ణ సమస్యలను బయట పడేస్తుంది .

ఉసిరి లో ఉండే విటమిన్లు, ఖనిజాలతో (With vitamins and minerals) సమృద్ధిగా లభించడంతో జీవక్రియ కూడా బాగా మెరుగుపరుస్తుంది. అలాగే బరువు నిర్వహణకు కూడా తోడ్పడుతుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను సమతుల్యం చేయడంలో బాగా సహాయపడుతుంది. ఇది మధుమేహ నిర్వహణకు ప్రయోజనకరంగా ఉంటుంది.

అలాగే గుండె ఆరోగ్యానికి ఇది చేసే మేలు అంతా ఇంతా కాదు. కొలెస్ట్రాల్ (Cholesterol) స్థాయిని తగ్గించడం ద్వారా గుండెను కాపాడుతుంది. అధిక రక్తపోటు రాకుండా చూసుకుంటుంది. ఆలాగే రక్తప్రసరణ మెరుగుపరుస్తుంది. దీనిలో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేషన్ గుణాలు ఎక్కువ. ఇది గుండె పోటు, స్ట్రోక్ వంటివి రాకుండా కూడా సహాయ పడుతుంది.

ఇక ఉసిరి రసం (Amla juice) తయారీ కోసం.. మనం ముందుగా ఉసిరి కాయలను గింజలు లేకుండా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. అనంతరం అవి నీటిని కలిపి జ్యూస్‌లాగా చేయాలి. తర్వాత అవసరమనుకుంటే వడకట్టండి. లేదంటే అలానే తీసుకోవచ్చు. దీనిలో కొద్దిగా తేనె, అల్లం, మిరియాల పొడి లేదా ఉప్పు వేసి తాగితే సరి. ఇలా రెగ్యులర్‌గా తాగితే మంచి రిజల్ట్ ఉంటుంది. ఉసిరి రోజూ మితంగా తీసుకునే చాలా మందిలో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. కానీ, కొందరిలో జీర్ణ అసౌకర్యం, అతిసారం లేదా అలెర్జీ ప్రతిచర్యలు వంటివి ఇబ్బందిపెట్టే అవకాశం ఉండవచ్చు అని నిపుణులు తెలుపుతున్నారు.