Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Amla: ఉసిరితో అనేక రోగాలకు చెక్ పెట్టచ్చు ..!

Amla: నిజానికి మనకి ఉసిరి కాయ మన ఆరోగ్యానికి మంచిదన్న సంగతి అందరికి తెలిసిందే. ఉసిరి లో ఉండే పోషకాలు ఎక్కువ. అలాగే ఉసిరితో ఆరోగ్య సమస్యలు, చర్మ సమస్యలు, జుట్టు సమస్యను సులువుగా తగ్గించుకోవచ్చు. ఉసిరిలో లభించే విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు, క్యాల్షియం, ఫాస్పరస్,ఐరన్, కెరోటిన్, బీ కాంప్లెక్స్‌తో (Antioxidants, calcium, phosphorus, iron, carotene, B complex)పాటు మనిరల్స్ వంటివి కూడా పుష్కలంగా లభిస్తాయి. ఉసిరిని ఎలా తీసుకున్నా శరీరానికి పోషకాలు అందుతాయి. అయితే ముఖ్యంగా ప్రతి రోజూ ఉదయం పరగడుపున ఉసిరి తినడం వల్ల మరింత బెటర్ అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఉదయం ఖాళీ కడుపుతో ఉసిరి కాయ నమిలి తినడం వల్ల ఎలాంటి ఉపయోగలు ఉన్నాయో కలుగుతాయో చూద్దాం..

డయాబెటీస్‌ తో (Diabetes) బాధ పడే వారు ఖాళీ కడుపుతో ప్రతి రోజూ ఉసిరి తినడం వల్ల డయాబెటీస్‌ని కంట్రోల్ లోకి తీసుకోని రావచ్చు. అలాగే షుగర్ వ్యాధిని అదుపులో ఉంచేందుకు ఉసిరి ఎంతో దివ్య ఔషధంగా పని చేస్తుంది. ఉసరిలో ఉండే క్రోమియం రక్తంలో చక్కెర స్థాయిన అదుపులో ఉంచేందుకు సహాయ పడుతుంది.

అధిక బరువు (overweight)తో బాధ పడే వారు ఉసిరి తినడం వల్ల అనేక మంచి ఫలితాలు పొందవచ్చు. ఇందులో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. ఉసిరిలో ఫైబర్ అనేది ఎక్కువగా లభిస్తుంది. ఇది త్వరగా ఆకలి వేయకుండా కడుపు నిండుగా ఉండేలా చేస్తుంది. ఉసిరిలో ఉండే పోషకాలు గట్ హెల్త్‌కి చాలా మంచి చేస్తుంది. మల బద్ధకం సమస్య, చెడు కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుంది. కనుక అతి త్వరగా బరువు తగ్గుతారు.

అలాగే ఉసిరి కాయ (amla)నమిలి తినడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి అనేది ఎక్కువగా లభిస్తుంది. ఉసరిలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ ఫ్లమేటరీ గునాలు, యాంటీ గ్లైసమిక్ (Vitamin C, antioxidants, anti-inflammatory properties, anti-glycemic)గుణాలు కలిగి ఉంటుంది . ఇలా ఉసిరి నమిలి తినడం వల్ల చర్మం, జుట్టు సమస్యల నుంచి బయట పడవచ్చు. అలాగే ముడతలు, మొటిమలు, మచ్చలు తగ్గి చర్మం క్లియర్‌గా చేసుకోవచ్చు. అలాగే చర్మం కాంతివంతంగా మెరుస్తుంది. ఇక ఉసిరి తినడం వల్ల జుట్టు కూడా ఆరోగ్యంగా, బలంగా అవ్వడంతో పాటు జుట్టు రాలడం, చుండ్రు తగ్గుతుంది. కుదుళ్లు ఆరోగ్యంగా ఉంటాయి.