Anjeer Side Effects: ప్రస్తుత రోజులలో కాలానికి తగ్గట్టు అనేక రోగాలు ప్రజలలో వెంటాడుతూనే ఉంటాయి. దీంతో ప్రజలు కూడా ఎప్పటికీ అప్పుడు వారి ఆరోగ్యాన్ని మెరుగు పరుచుకోవడం కోసం అనేక ఆరోగ్య పోషకల కోసం నిత్యం హెల్త్ టిప్స్ (health tips)ను పాటిస్తూనే ఉంటారు. వారి శరీరానికి కావాల్సినంత శక్తిని పెంచుకునే కోసం వివిధ రకాల ఔషధ గుణాలు లభించే పదార్థాలను వెతుక్కుంటూ ఉంటారు.
ఈ క్రమంలో వారు తినే ఆహారంలో తీసుకునే మోతాదులు కంటే ఎక్కువగా తీసుకుంటే వారికి ప్రమాదం అని తెలిసినా కూడా అలానే వారు తీసుకోవడం మనం ఎన్నో చూశాం. ఈ లిస్టులో అంజీర (Anjeer )కూడా ఒకటి. మనం ఎక్కువ మోతాదులో అంజీర పండ్లను తినడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు. నిజానికి అంజీర పండులో కాల్షియం, పొటాషియం, ఫాస్పరస్, మాంగనీస్, కాపర్, మెగ్నీషియం ( Calcium, Potassium, Phosphorus, Manganese, Copper, Magnesium) లాంటి అనేక ఖనిజాలు లభిస్తాయి.
ఈ క్రమంలో అంజీరా లో ఉండే ఆక్సిలేటర్ శరీరంలో క్యాల్షియం లో సంహరించడం వల్ల కాల్షియం కొరత ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా అంజీర (anjeer)అధికంగా తినడం వల్ల శరీరంలో సల్ఫైట్ పెరగడంతో పాటు మైగ్రేన్ అటాక్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువ. అందుకోసమే అంజీర పండ్లను తినవద్దు అని డాక్టర్ తెలియజేస్తున్నారు. అంతేకాకుండా మనలో ఎవరైనా కానీ ఎలర్జీ సమస్యతో బాధపడేవారు అంజీర పండ్లను అసలు తినకూడదు. అంజీర తినడం వల్ల గింజలు పేగులో చిక్కుకొని లివర్ ను పాడు చేసే ప్రమాదం ఉంటుందని డాక్టర్స్ అంటున్నారు. ఏది ఏమైనా కానీ అంజీర పండ్లను మితంగా తీసుకోవడం మంచిది. ఇక మధుమేహంతో (diabetics) బాధపడేవారు అసలు అంజీర పండ్లను తినకూడదు ఎందుకు అంటే అంజీరా లో షుగర్ (suagr)కంటెంట్ ఎక్కువగా ఉంటుంది.