Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Banana: అరటి పండుకు నిద్రకు ఇంత సంబంధం ఉందా..?

Banana: మనకి సీజన్ తో పని లేకుండా ఎళ్లవేళ లభించే పల్లెల్లో ఒకటి అరటిపండు. అతి తక్కువ ఖర్చులు ఎక్కువ పోషకాలు లభించే అరటిపండును (Banana) తీసుకోవడం వల్ల అనేక లాభాలు ఉన్నాయని డాక్టర్స్ కూడా తెలియజేస్తున్నారు. ప్రతిరోజు ఒక అరటి పండును తీసుకుంటే శరీరంలో అనేక మార్పులు వచ్చేందుకు సహాయపడుతుందని డాక్టర్స్ అంటున్నారు. అంతేకాకుండా క్రమం తప్పకుండా అరటిపండ్లు తింటే మాత్రం మంచి నిద్ర (sleep)కూడా వస్తుందని నీ పనులు అంటున్నారు. అసలు నిద్రకు అరటిపండుకు సంబంధం ఏమిటి అనేది ఇప్పుడు చూద్దాం మనం…

వాస్తవానికి అరటిపండు లో పొటాషియం, మెగ్నీషియంతో పాటు విటమిన్ బి6 (Vitamin B6 along with potassium and magnesium) చాలా పుష్కలంగా లభిస్తుంది. నిజానికి ఇవి శరీరానికి రిలాక్స్ చేయడంతో పాటు ప్రశాంతను కూడా కలగచేస్తాయి. వాస్తవానికి మెగ్నీషియం శరీరాన్ని విశ్రాంతిగా ఉంచేలాగా చేస్తుంది. అలాగే విటమిన్ b6 మానసిక స్థితిని మెరుగుపరచడంలో బాగా సహాయపడుతుంది.. ఈ పోషకాలు ఉండడం వల్ల అరటి పండు తీసుకోవడంతో నిద్రలేమి సమస్య నుంచి సులువుగా బయటపడవచ్చు అంటూ డాక్టర్ తెలియజేస్తున్నారు. అలాగే శరీరానికి కావాల్సిన రోజువారి పొటాషియం, మెగ్నీషియం అవసరాలతో కొంత భాగాన్ని మాత్రమే తీరుస్తుందని నిద్ర నాణ్యతలో మెరుగుదలకు బాగా ఉపయోగపడుతుందని డాక్టర్ తెలియజేస్తున్నారు.

ఇక అరటిపండ్లలో మెగ్నీషియం (magnesium) శాతం కూడా చాలా తక్కువగా ఉంటుందని శరీరానికి ప్రతిరోజు 400 mg మెగ్నీషియం అవసరం ఉంటుందని కేవలం ఒక్క అరటిపండుతో శరీరానికి కావాల్సిన పోషకాలు లభించని డాక్టర్ తెలియజేస్తున్నారు.. అలాగే అరటిపండు తీసుకోవడంలో పలు జాగ్రత్తలు తప్పనిసరి… అరటిపండు ఆరోగ్యానికి మేలు చేస్తుందని డయాబెటిస్ సమస్యలతో బాధపడేవారు అరటిపండు తీసుకుంటే మాత్రం కాస్త ప్రమాదం అని చెప్పాలి.. అరటిపండు లో సహజ చక్కర ఉంటుంది కాబట్టి రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుంది, కనుక డయాబెటిస్తో (diabetics)బాధపడుతున్న వారు అరటిపండ్లకు దూరంగా ఉంటే మంచిది అని డాక్టర్స్ తెలియచేస్తున్నారు