Black pepper: సీజనల్ వ్యాధులకు నల్ల మిరియాలు (Black pepper) అనేవి దివ్యౌషధంగా పనిచేస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మరీ ముఖ్యంగా ఈ వర్షా, శీతాకాలంలో (Rainy, winter) అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. వీటి నుంచి మనల్ని మనం కాపాడుకోవాలంటే డైట్‌లో కొన్ని ఇంగ్రిడియంట్స్ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. వీటి వల్ల ఈ సీజన్‌లో వచ్చే సీజనల్ సమస్యల్ని దూరం చేసుకోవచ్చు. అందులో భాగంగా మిరియాలని యాడ్ చేసుకోవడం ఎన్నో రకాలైన ఆరోగ్య ప్రయోజనాలు (Health benefits) ఉన్నాయని అంటున్నారు ఆయుర్వేద డాక్టర్లు.
ముఖ్యంగా, ఈ సీజన్లో జనాలకు కడుపు ఉబ్బరం, అజీర్ణం, జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తడం సర్వసాధారణం. అందుకే నల్ల మిరియాలు కడుపులోకి తీసుకుంటే హైడ్రోకోరిక్ యాసిడ్ (Hydrochoric acid) స్రావాన్ని పెంచి జీర్ణక్రియని రెగ్యులేట్ చేస్తుంది. ఇది ఆహారాన్ని విచ్చిన్నం చేసి, పోషకాల శోషణని పెంచుతుంది. అదనంగా, నల్ల మిరియాలు (Black pepper) కార్మినేటివ్ లక్షణాలను కలిగి ఉంటాయి కాబట్టి ఆపానవాయువుని తగ్గిస్తుంది. సహజంగానే నల్ల మిరియాలు యాంటీ మైక్రోబయల్ లక్షణాలు కలిగి ఉంటాయి కనుక వివిధ వ్యాధికారక కారకాల పెరుగుదలని నిరోధించగలవు. ఇక ఇవి సహజ యాంటీ బయాటిక్‌గా పనిచేస్తాయని మీలో ఎంతమందికి తెలుసు? హానికరమైన బ్యాక్టీరియా పెరుగుదలని నివారించి, ఇన్ఫెక్షన్స్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
మీ భోజనంలో నల్ల మిరియాలని యాడ్ చేయడం వల్ల మన ఆరోగ్యానికి అవసరమైన పోషకాలను సమర్థవంతంగా గ్రహించేలా సహకరిస్తుంది. అయితే వీటిని ఎలా తీసుకుంటే మంచిది? గోరువెచ్చని నీటిలో మిరియాల పొడి కలిపి తీసుకుంటే వీటి వల్ల రిలాక్సేషన్ లభిస్తుంది. అదే విధంగా వండిన ఆహారం, కూరలలో కూడా వీటి పొందిన తగినంత మెదడులో యాడ్ చేసుకోవచ్చు. అంటే, మిర్చి ప్లేసులో వీటిని రీప్లేస్ చేయడం ద్వారా ఆహారం రుచితో పాటుగా, ఆరోగ్యం మీ సొంతం అవుతుంది. ఇక నల్ల మిరియాలని తీసుకున్నవారు శోథ నిరోధక లక్షణాలను కలిగి ఉంటారు. ఇందులో పైపెరిన్ మంటను తగ్గించి, నొప్పిని తగ్గిస్తుంది. మీ ఆహారంలో నల్ల మిరియాలని చేర్చితే మంటని ఎదర్కోవడంలో, కీళ్ళ ఆరోగ్యాన్ని (Joint health) కూడా కాపాడుతుంది అనడంలో అతిశయోక్తి లేదు.