Boiled Eggs: మనలో చాల మందికి కోడి గుడ్లు అంటే చాలా ఇష్టం. అలాగే చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరుకు కోడి గుడ్లు చేసే రెసిపీలు ఇష్టంగా తింటారు. అలాగే గుడ్డు తో చేసే కర్రీలు, స్నాక్స్ (Curries, snacks)ఏం చేసినా ఎంతో టేస్టీగా ఉంటాయి. కోడి గుడ్లు కేవలం రుచి మాత్రమే కాకుండా.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా లభిస్తాయి. ఈ విషయా చాలా మందికి తెలుసు. కానీ ఎలాంటి ఆరోగ్య బెనిఫిట్స్ ఉన్నాయో మాత్రం సర్రిగా తెలియాదు. అలాగే ప్రతి రోజూ కోడిగుడ్లను (eggs) ఉడకబెట్టి తినడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి . వీటితో ఎన్నో అనారోగ్య సమస్యలు దరి చేరకుండా ఉంటాయి. మరి అవేంటో ఇప్పుడు చూద్దాం..
నిజానికి కోడి గుడ్లలో (eggs) హై క్వాలిటీ ప్రోటీన్లు ఉంటాయి. అలాగే అమైనో యాసిడ్లు ఉంటాయి. దీనితో కండరాలను ఆరోగ్యంగా ఉంచడానికి బాగా సహాయ పడుతాయి. అలాగే కండరాల వాపులు, నొప్పులను తగ్గించడంలో ఎంతో చక్కగా సహాయ పడతాయి. అంతే కాకుండా రోగ నిరోధక శక్తిని కూడా పెంచుకోవచ్చు. అలాగే ప్రతి రోజూ ఉడకబెట్టిన ఒక కోడిగుడ్డు పిల్లలకు ఇవ్వడం వల్ల పిల్లల్లో చక్కటి ఎదుగుదల లభిస్తుంది. ఇందులో మంచి ప్రోటీన్ అందుతుంది. పిల్లలకు కూడా ఎనర్జీ (energy)కూడా అందుతుంది. కండరాలు, ఎముకలు బలంగా ఉండటంలో, ఎదుగుదలలో కూడా సహాయ పడుతుంది.
ఇక ఉడకబెట్టిన గుడ్లు తినడం వల్ల ఎముకలు బలంగా, దృఢంగా లభిస్తాయి అలాగే విటమిన్ డి, బి 12, బి2 రైబోఫ్లేవిన్ ఉంటాయి. ఇవి ఎముకలను బలంగా ఉంచేలా చేయడంలో సహాయం చేస్తాయి. మన శరీరానికి క్యాల్షియాన్ని సరిగా శోషించుకునేలా చేస్తుంది. కోడి గుడ్లు తినడం వల్ల రక్తంలోని బ్యాడ్ కొలెస్ట్రాల్‌ను (Bad cholesterol) తగ్గించి మంచి కొలెస్ట్రాల్‌ను పెంచి ఆరోగ్యంగా ఉంచుతుంది. ఉడకబెట్టిన గుడ్లు ప్రతి రోజూ తినడం వల్ల మన కళ్ల ఆరోగ్యం కూడా మెరుగు పడుతుంది. ఇందులో ఉండే లుటీన్, జియాజాంతిన్ యాంటీ ఆక్సిడెంట్లు.. కళ్లను అతినీల లోహిత కిరణాల నుంచి సంరస్సాక్షిస్తుంది. అలాగే కంటి శుక్లాలు, దృష్టి లోపాల నుంచి బయట పడేస్తుంది.