Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Chia Seeds: చియా సీడ్స్ వాళ్ళ ఆరోగ్య బెనిఫిట్స్ ఇవే

Chia Seeds: ప్రస్తుతరోజులలో చాల మంది ఎన్నో అనారోగ్య సమస్యలతో భాద పడుతూ ఉన్నారు.. ఈ క్రమంలో మన ఆరోగ్యంపై దృష్టిపెట్టడం చాలా ముఖ్యం అలాగే మంచి జీవనశైలి అనారోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలి అలాంటి ఆరోగ్యకరమైన వాటిల్లో చియా గింజలు కూడా ఒకటి.. సాధారణంగా చాలా మంది చియా సీడ్స్ (Chia Seeds)ను సూపర్‌ఫుడ్‌గా పరిగణిస్తారు. అందుకు గల కారణం ఏమిటంటే వాటిలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, ఫైబర్, ప్రొటీన్లు (Omega-3 fatty acids, fiber, proteins) పుష్కలంగా లభిస్తాయి. దింతో ఈ విత్తనాలను స్మూతీస్, పెరుగు, అనేక ఇతర ఆహార పదార్థాలలో కూడా వాడుతారు. అలాగే సాధారణంగా చియా సీడ్స్ ను నానబెట్టి.. ఉదయం లేదా మధ్యాహ్నం సమయంలో తీసుకుంటారు.. ఈ ప్రత్యేకమైన విత్తనాలు.. బరువును తగ్గించడానికి బాగా ఉపయోగపడుతాయి.. కానీ చియా గింజలను ఎక్కువగా తినడం ప్రతికూలంగా ఉంటుందని డాక్టర్లు తెలుపుతున్నారు. అలాగే చియా గింజలు ఎక్కువగా తినడం వల్ల శరీరానికి కలిగే హాని కూడా తెలుసుకుందాం..

వాస్తవినికి చియా గింజల్లో ఫైబర్ (fiber) పుష్కలంగా లభిస్తుంది. దింతో రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించడంలో బాగా సహాయపడుతుంది. అయితే, రక్తంలో చక్కెర స్థాయి (Blood sugar level) పూర్తిగా తగ్గిపోతే, ఫలితాలు తారుమారు కూడా కావచ్చు. కాబట్టి షుగర్ నియంత్రణకు రెగ్యులర్ ఇన్సులిన్ తీసుకునే వారికి ఈ సీడ్స్ కాస్త ప్రమాదకరం అనే చెప్పాలి.

అలాగే మనలో చాలా మంది అధిక రక్తపోటుతో బాధపడుతున్నారు. కనుక వారు ప్రతిరోజు అధిక రక్తపోటు మందులు వాడాలి. చియా గింజల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ (Omega-3 fatty acids)పుష్కలంగా లభిస్తుంది. ఇవి రక్తాన్ని పల్చగా చేస్తాయి. ఫలితంగా, రక్తపోటు మందుల ప్రభావం నిరోధించబడుతుంది. కాబట్టి ఈ సమస్య ఉన్నవారు నిపుణులను సంప్రదించిన తర్వాతే చియా విత్తనాలను వాడడం మంచిది.

ఇక చియా గింజల్లో ఫైబర్ (fiber) పుష్కలంగా లభిస్తుంది. అలాగే ఇవి ఎక్కువగా తీసుకుంటే జీర్ణ సమస్యలు తలెత్తుతాయి. దానికి గల కారణం ఏమిటంటే అధిక పీచు జీర్ణక్రియ ప్రక్రియకు అంతరాయం కలిగిస్తుంది. ఫలితంగా, కడుపు ఉబ్బడం, గ్యాస్, గుండెల్లో మంట సమస్యల కు వస్తాయి.