Diabetes Patients: ఉల్లిపాయను ఇలా తింటే మధుమేహానికి చెక్
Diabetes Patients:ప్రస్తుత రోజులలో మధుమేహం సమస్యతో భాద పడేవారు ఎక్కువగా ఉన్నారు. ఈ డయాబెటిక్ వ్యాధిగ్రస్తుల్లో ఆహారం కొంచెం ఎక్కువైనా తక్కువైనా షుగర్ (sugar)హెచ్చుతగ్గులకు ధారి తీస్తుంది . కనుక మధుమేహం బాధితులు ఏది తినాలన్న కూడా చాల మంది ఆలోచించాల్సి ఉంటుంది.కొన్ని శాశ్వతంగా వదిలించుకోలేని షుగర్ వ్యాధిని, వైద్యులు సూచించిన మేరకు మందులు వాడుతూనే.. శారీరక శ్రమ, కొన్ని కూరగాయలు తీసుకోవడం ద్వారా షుగర్ అదుపులోకి వస్తుంది. అయితే మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఉల్లిపాయ ఒక వరంలాంటిది ఆరోగ్య నిపుణులు (docters) అంటున్నారు . రక్తంలో చక్కెరను నియంత్రించడానికి ఉల్లిపాయలు సులభమైన మార్గంగా సూచిస్తున్నారు. అవి ఏమిటో చూద్దమా..
వాస్తవానికి ఉల్లిపాయపై నిమ్మరసం పిండుకొని తినడం వల్ల…. మనం ఊహించని ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఉల్లిపాయను నిమ్మరసంలో నానబెట్టి తినడం వల్ల మధుమేహ వ్యాధిగ్రస్తులకు రక్తంలో (blood)చక్కెర స్థాయిలు వేగంగా అదుపులోకి వస్తాయి. ఉల్లిపాయ, నిమ్మరసం రక్తంలో చక్కెరను నియంత్రించడంలో బాగా సహాయపడుతుంది
ఇక షుగర్ బాధితులు పచ్చి ఉల్లిపాయలు (Onions) తరచూగా తినడం అలవాటు చేసుకుంటే చాల మంచిదని డాక్టర్లు అంటున్నారు. అలాగే ప్రతిరోజూ సలాడ్‌లో పచ్చి ఉల్లిపాయను తీసుకుని, అందులో నిమ్మరసం పిండుకొని తింటే మంచి ఫలితం కూడా వస్తుంది. అలాగే డయాబెటిక్ తో భాద పడేవారు రక్తంలో చక్కెరను నియంత్రించడానికి నిమ్మరసంలో నానబెట్టిన ఉల్లిపాయ ఒక ప్రభావవంతమైన మార్గం అనే చెప్పాలి.
వాస్తవానికి ఉల్లిపాయల్లో క్రోమియం, సల్ఫర్ (Chromium, Sulphur) ఉంటాయి. దింతో రక్తంలో చక్కెరను నియంత్రించడంలో బాగా సహాయపడుతుంది. అలాగే నిమ్మరసంలో విటమిన్ సి, విటమిన్ ఎ పుష్కలంగా ఉంటాయి. ఇందులోని యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణగా ఉంటుంది. ఇక ప్యాంక్రియాస్‌లో ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచడంలో పచ్చి ఉల్లిపాయలు బాగా సహకరిస్తాయి. దీన్ని తీసుకోవడం వల్ల షుగర్ బాధితుల రక్తంలో చక్కెర స్థాయి అదుపులోకి వస్తుంది . నిమ్మరసంలో నానబెట్టిన ఉల్లిపాయ (Soaked onion) రసాన్ని తింటే షుగర్ లెవెల్ వెంటనే తగ్గుతాయి అలాగే వారి ఆరోగ్యం కూడా అదుపులోకి వస్తుంది.