Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Diabetes patients: మధుమేహం రోగులకు మినపప్పు బెస్ట్..?

Diabetes patients: మనం మినపప్పును ఇడ్లీలు, దోసెలు, వడలు (Idlis, dosas, fritters) లాంటి అల్పాహారాల తయారీలో వాడుతూ ఉంటాం. మన రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు, కేరళలో మినపప్పును ఎక్కువగా వాడుతారు. అలాగే కొన్నిరకాల జబ్బుల బారీన పడిన వారు త్వరగా కోలుకోవాలంటే మినపప్పుతో చేసిన వంటకాలు ఎక్కువగా తోఇసుకోవాలి అని ఆయుర్వేద ఆరోగ్య నిపుణులు కూడా తెలుపుతూ ఉంటారు. ఇలా మినపప్పు ను ఉపయోగించిన వంటకాలు రుచితోపాటు, ఎన్నోఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అవేంటో ప్రయోజనాలు ఏవంటే..

ఆయుర్వేద వైద్యంలో ఆస్తమా, పక్షవాతం, ఆర్థరైటిస్, (Asthma, Paralysis, Arthritis) వంటి వ్యాధులను నివారించే క్రమంలో ఈ పప్పును బాగా ఉపయోగిస్తారు. ఈ మినపప్పును లో ప్రోటీన్లు, విటమిన్ బీ (Proteins and vitamin B)పుష్కలంగా ఉంటాయి. ఇలా మినపప్పు తీసుకోవడం వల్ల తల నొప్పి, జ్వరం, ఇంఫ్లమేషన్ వంటి సమస్యల నుండి సులువుగా బయటపడొచ్చు. అలాగే డయాబెటిస్ రోగులకే కాదు అందరికీ ఇది మంచి బలవర్ధకమైన ఆహారం. మినపప్పులో ఎసెన్షియల్ ఎమైనో యాసిడ్స్ ప్రధాన పాత్ర పోషిస్తాయి. అలాగే కిడ్నీల సంరక్షణలో మినపప్పు అద్భుతంగా పనిచేస్తుంది.

ఇక మెయిన్ గా డయాబెటిస్ రోగులకు (Diabetes patients) ముఖ్యంగా కావాల్సింది హెల్తీ డైట్. హెల్తీ డైట్ లో భాగంగా ప్రోటీన్లు, ఫైబర్ అధికంగా ఉండే ఆహారం తప్పకుండా వారు తినాలి. ప్రోటీన్ అండ్ ఫైబర్ ఆధారిత ఫుడ్స్ తీసుకోవడం వల్ల ఆరోగ్యం మెరుగ్గా ఉండటమే కాకుండా బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణలో కూడా బాగా సహాయ పడుతుంది. ముఖ్యంగా మినపప్పు ఇందుకు అద్భుతంగా పనిచేస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. మినప పప్పులో ఉండే పోషకాలు ఎముకలను దృఢంగా చేస్తాయి. పప్పు గట్‌ హెల్త్‌ ను మెరుగుపరిచి, శరీరంలోని ఐరన్‌ లెవల్స్‌ ను పెంచేందుకు కూడా సహాయ పడుతాయి.

అలాగే నాడీ బలహీనత, పాక్షిక పక్షవాతం, ముఖ పక్షవాతం, ఇతర రుగ్మతల నివారణకు వివిధ ఆయుర్వేద ఔషధాలలో మినపప్పును వాడుతారు. ఇక మధుమేహం ఉన్నవారికి కూడా ఇది వాడడం చాల మంచిది. మినపప్పు (urad dall) గ్లూకోజ్ స్థాయిలను నియంత్రిస్తుంది. మినపప్పులో ప్రోటీన్లు చాలా ఎక్కువగా లభిస్తాయి. ఇందులో పొటాషియం, ఐరన, ఫోలేట్, కాల్షియం పెద్దమొత్తంలో ఉంటుంది. మినపపప్పులో రెండు రకాలుంటాయి. ఇందులో మెయిన్ గా తొక్క ఉన్నవి తింటే మరింత లాభాలు పొందవచ్చు.