Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Diabetic patients : డయాబెటిక్ పేషెంట్లు బెండకాయ తినవచ్చా..?

Diabetic patients : నిజానికి ఒకరికి షుగర్ (sugar)వ్యాధి వచ్చింది అంటే అది ఇక వారిని ఎప్పటికీ వదిలి పెట్టాడు. ఈ వ్యాధిని మందులతో అసలు నిర్మూలించలేము అదుపులో ఉంచుకోవటం ఎక్కిక మార్గం. అందు కొరకే మధుమేహం బాధితులు తమ ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండరు. ఇక లేకపోతే అధిక చక్కెర స్థాయిలు ప్రాణాంతక సమస్యలను కలిగిస్తాయి. ఇక మధుమేహం ఉన్నవారు బెండకాయ తినవచ్చా లేదా..? అన్నది చాలా మందిని ఒక ప్రశ్నగానే ఉంది. ఈ బెండకాయను డయాబెటీస్ ఉన్నవారు తినొచ్చా? తింటే కలిగే లాభనష్టాలేంటీ? అని తెలుసుకుందామా..

వాస్తవానికి బెండకాయలో చాలా పోషకాలు లభిస్తాయి. ఇక అనేక ఆరోగ్య ప్రయోజనాలను (health benefits) అందిస్తాయి. అలాగే బెండకాయలో విటమిన్ ఎ, సి (vitamin a,c)ఉన్నాయి. ఇవి ఆరోగ్యకరమైన చర్మాన్ని అందించడంలో కూడా బాగా పని చేస్తాయి. మీ కంటి చూపును మెరుగుపరచడమే కాకుండా, మీ రోగనిరోధక శక్తిని పెంచే విటమిన్ సి కూడా లభిస్తుంది.అలాగే రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రించడంలో బెండకాయలు ఎంతగానో సహాయపడుతాయని పోషకాహార నిపుణులు తెలుపుతున్నారు. డయాబెటిక్ పేషంట్ అయితే మీ డయాబెటిస్‌ డైట్లో భాగంగా బెండకాయలను తీసుకోవచ్చు. బెండకాయలో గ్లైసిమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉంటుంది. ఇది వేగంగా పెరుగుతున్న చక్కెర శాతాన్ని కంట్రోల్‌ చేయడానికి సహాయ పడుతుంది.దింతో రక్తంలో చక్కెరను నియంత్రణలో ఉంచుతుంది.

అలాగే బెండకాయలో లభించే ఫైబర్ (fiber)భోజనం తర్వాత రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో ఉపయోగపడుతుంది. బెండకాయలో ఉండే క్వెర్సెటిన్, కాటెచిన్స్ వంటి యాంటీఆక్సిడెంట్లు రక్తంలో చక్కెర స్థాయిలు అధికంగా ఉండటం వల్ల కలిగే నష్టం నుంచి రక్షిస్తుంది. దీని ఫలితంగా రక్త కణాలు ఆరోగ్యంగా ఉంటాయి.

ఇక బెండకాయ ఇన్సులిన్ సెన్సిటివిటీని (Insulin sensitivity)మెరుగుపరుస్తుంది. ఇక శరీరం ఇన్సులిన్‌ను మరింత ప్రభావవంతంగా ఉపయోగించుకోవడానికి సహాయపడుతుంది. బెండకాయ గమ్మీ ఫుడ్ కాబట్టి, ఇది జీర్ణవ్యవస్థకు అనేక ప్రయోజనాలను పొందవచ్చు.. ఇది పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా బాగా సహాయపడుతుంది. షుగర్ సమస్యతో బాధ పడే వారు ఉదయాన్నే బెండకాయ వాటర్ తాగడం అలవాటు చేసుకుంటే మాత్రం వాళ్ళు ఎపుడు కూడా ఆసుపత్రికి వెళ్లాల్సిన అవసరం రాదని వైద్యనిపుణులు అంటున్నారు. అలాగే బెండకాయ నీటిలో ఉండే ఫినాలిక్ సన్ బర్న్ అయిన చర్మాన్ని శుభ్రపరచడంలో కూడా బాగా సహాయపడుతుంది.