Figs: మన ఆరోగ్యానికి అంజీర్ (Figs)చాలా మంచిదని డాక్టర్లు అంటున్నారు. అంజీర్ పండ్లు తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని పోషకాహార నిపుణులు తెలుపుతున్నారు. అయితే, అంజీర్ పండ్లును Figs) డైరెక్ట్ గా కాకుండా నానబెట్టి తీసుకుంటే అనేక లాభాలు కలుగుతాయని నిపుణులు తెలుపుతున్నారు. మెయిన్ గా బరువు తగ్గాలనుకునేవారు అంజీర్ తింటే చాలా ప్రయోజనం కలుగుతుంది. అలాగే ఈ పండు మహిళల్లో మెటాబాలీజం, స్టామినాను (Metabolism, stamina) పేణుచుకుండేందుకు బాగా సహాయ పడుతాయి. కనుక రెగ్యూలర్‌గా తీసుకోవచ్చు. అయితే, ఇందుకోసం ఒక నియమం ఉంది.. అది ఏమిటంటే.. అంజీర్ జీర్ణ ఆరోగ్యానికి మంచిది. వీటిని తీసుకోవడం వల్ల మలబద్ధకం సమస్య నుంచి బయట పడవచ్చు. అలాగే ఆరోగ్యకరమైన పేగు కదలికలకు బాగా సహాయపడుతుంది. అలాగే అంజీర్‌లో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇందులో కరిగే కరగని ఫైబర్ రెండూ ఉంటాయి. ఇక అంజీర్ లో ఉండే డైటరీ ఫైబర్ మెరుగైన జీర్ణక్రియను అందిస్తుంది. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంతో పాటు గుండె ఆరోగ్యానికి కూడా సహాయ పడుతుంది.
ఇక అంజీర్‌లో లభించే పాలీఫెనల్స్, ఫ్లెవనాయిడ్స్ (Polyphenols, flavonoids) అనే యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. దీనితో ఫ్రీ రాడికల్ సమస్య రాకుండా మన శరీరాన్ని కాపాడతాయి. అంతేకాదు అంజీర్ పండ్లను తరచూ తీసుకోవడం వల్ల కేన్సర్ లాంటి ప్రాణాంతక వ్యాధులను కూడా తరిమి కొట్టవచ్చు.ఇక అంజీర్‌లో ఎన్నో విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా లభిస్తాయి. ఇక విటమిన్ కే, ఏ, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్ (Vitamin K, A, Potassium, Calcium, Magnesium, Iron)ఉండటం వల్ల ఇవి మన శరీర పనితీరుకు మనకి ఎంతో ఆరోగ్యకరం. అంజీర్‌లో ఉండే విటమిన్ ఎ,సి, ఈ వృద్ధాప్య ఛాయలను దూరం చేస్తుంది. స్కిన్‌కు మంచి ఫలితాలు ఇస్తాయి. నానబెట్టిన అంజీర్‌ను రోజూ తింటే మన జుట్టుకు కూడా చాల మంచిది. ఈ అంజీర్ పండును మన డైలీ డైట్ లో చేర్చుకుంటే చాల మంచిది అని డాక్టర్లు సూచనా.