Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Gas Trouble: మలబద్ధకం, గ్యాస్ సమస్య వారికీ ఇవే బెస్ట్ రెమిడీస్

Gas Trouble: ప్రతుతం రోజులలో మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే వారి జీర్ణ క్రియ ప్రక్రియ కూడా సరిగ్గా ఉండడం తప్పని సరి. మారిన జీవన విధానంతో మలబద్ధకం, గ్యాస్ సమస్యతో (Gas Trouble)ఎక్కువ మంది ఇబ్బంది ఇబ్బంది పడుతూన్నారు. నిజానికీ మలబద్ధకం అనేది ప్రేగు కదలికలు సరిగ్గా జరగని సమస్య .. దీని కారణంగా కడుపు బరువు, నొప్పి, అసిడిటీ వంటి సమస్యలు కూడా వస్తాయి. ఈ మలబద్దనికి కారణాలు శారీరక శ్రమ తక్కువగా చేయడం, సోమరితనం, రోజువారీ దినచర్యలో (Laziness, daily routine) ఎక్కువగా తినడం, బలహీనమైన జీర్ణక్రియ మొదలైనవి అని డాక్టర్లు అంటున్నారు. ఇక ఈ జీర్ణక్రియను మెరుగుపరచడానికి ప్రతిరోజూ ఉదయం కొన్ని యోగా ఆసనాలు వేయవచ్చు, ఇది అజీర్ణం, మలబద్ధకం, ఆమ్లత్వం, గ్యాస్ (Indigestion, constipation, acidity, gas)వంటి సమస్యల నుండి ఉపశమనం సులువుగా పొందవచ్చు.

ఈ క్రమంలో కడుపు సమస్యల (Stomach problems)నుండి బయటపడటానికి పవన్ముక్తాసనం అద్భుతమైన యోగాసనంగా అంచనా. ఈ యోగ భంగిమను ప్రతిరోజూ ఆచరించడం వల్ల మలబద్ధకంతో పాటు కడుపులో గ్యాస్ నుండి ఉపశమనం పొందవచ్చు. అలాగే జీర్ణవ్యవస్థను బలపరుస్తుంది, తద్వారా మళ్లీ మళ్లీ ఈ సమస్యలను ఎదుర్కోవాల్సిన అవసరం కూడా ఉండదు అనే చెప్పాలి.

అలాగే మలసానాన్ని క్రమం తప్పకుండా సాధన చేయడం వల్ల జీర్ణవ్యవస్థ సక్రియం కూడా అవుతుంది. కొన్ని రోజుల్లో మలబద్ధకం నుండి ఉపశమనం పొందుచు. అంతే కాకుండా ఈ ఆసనం మహిళలకు (womans) చాలా సహాయపడుతుంది. ఈ ఆసనం చేయడం వల్ల మహిళలు పీరియడ్స్ సమయంలో వచ్చే నొప్పి నుండి బయట పడవచు. పెల్విక్ ప్రాంతం బలపడుతుంది. గర్భధారణ సమయంలో కూడా ఈ ఆసనం ప్రయోజనకరంగా వారికీ సహాయ పడుతుంది.

ఈ లిస్ట్ లోకి వజ్రాసనం…ఆహారం తిన్న వెంటనే చేయాల్సిన యోగాసనం ఇదే. నిజానికి ఈ ఆసనం చేయడం వల్ల ఆహారం తేలికగా జీర్ణమవుతుంది. ఎవరికైనా తిన్న తర్వాత నడకకు సమయం లేకపోతే, ఆహారం తిన్న తర్వాత వజ్రాసనంలో కొంతసేపు కూర్చోవచ్చు. ఇది కాకుండా ఈ ఆసనాన్ని క్రమం తప్పకుండా సాధన చేయడం వల్ల గ్యాస్, మలబద్ధకం, అజీర్ణం (Gas, constipation, indigestion) వంటి సమస్యల నుండి సులువుగా బయట పడవచ్చు.