Hot Water: మనలో చాల మందికి ప్రాణాలను బలిగొంటున్న వ్యాధుల్లో (dieases) మధుమేహం కూడా ఒకటి. ఇది సైలెంట్ కిల్లర్‌లా ఎటాక్ చేస్తున్న షుగర్ వ్యాధి లక్షణాలను ప్రారంభంలోనే గుర్తించలేకపోతున్నారు చాల మంది. ఈ వ్యాధి ఉన్న వారికి అవయవాలు కూడా ప్రభావితమవుతాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులు వారు తినే, తాగే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా వహించాలి లేకపోతె వాళ్ళకి చాల ప్రమాదం. అప్పుడే, రక్తంలో (blood) చక్కెర నియంత్రణలో ఉంటుంది. అందువల్ల నల్ల ఉప్పు డయాబెటిక్ రోగులకు ప్రయోజనకరంగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. దీంతో మలబద్ధకం సమస్య కూడా దూరమవుతుంది. బరువు తగ్గడంలో కూడా సహాయపడుతుంది. నల్ల ఉప్పుతో కలిగే లాభాలేంటో మనం ఇప్పడూ తెలుసుకుందాం ..
నల్ల ఉప్పు ఆరోగ్యానికి చాలా ఆరోగ్యకరమైనదిగా ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీని వినియోగం వల్ల గ్యాస్, అజీర్ణం, బరువు పెరగడం, కొలెస్ట్రాల్ సమస్యలు రావు. ఐరన్, సోడియం, కాల్షియం (Iron, Sodium, Calcium)వంటి మూలకాలు నల్ల ఉప్పులో ఉంటాయి. తెల్ల ఉప్పుకు బదులుగా నల్ల ఉప్పు తీసుకోవడం మధుమేహంతో బాధపడేవారికి మరింత యూసేఫుల్ అవుతుందని అంటున్నారు డాక్టర్లు.అలాగే నల్ల ఉప్పును నీటిలో కలిపి తీసు కుంటే మధుమేహం సమస్య నయమవుతుందని నిపుణులు చెబుతున్నారు. ఉదయాన్నే వేడి నీటిలో బ్లాక్ సాల్ట్ కలిపి తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులోకి వస్తాయి. ఈ బ్లాక్ సాల్ట్‌తో ఆరోగ్యకరమైన శరీరానికి అవసరమైన ఇనుము, కాల్షియం, మెగ్నీషియం వంటి ముఖ్యమైన ఖనిజాలు లభిస్తాయి.
ఇలా బ్లాక్ సాల్ట్ తీసుకోవడం వల్ల ఎసిడిటీ, అపానవాయువు (Acidity, flatulence)తగ్గుతాయి, అలగే కాలేయానికి చాలా మేలు చేస్తుంది. దీన్ని తీసుకోవడం వల్ల గ్యాస్ నుంచి ఉపశమనం కూడా లభిస్తుంది. ఇక బ్లాక్ సాల్ట్ ఎసిడిటీ రోగులకు కూడా మేలు చేస్తుంది. నల్ల ఉప్పులో ఉండే సోడియం క్లోరైడ్ రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇది కాలేయానికి చాలా మేలు చేస్తుంది. శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపేందుకు నల్ల ఉప్పు సహకరిస్తుంది. దీంతో జీర్ణాశయం మెరుగు పరుస్తుంది. అలాగే ఫైల్స్ సమస్య ఉన్నవారు ఇలా చేస్తే వెంటనే ఉపశమనం లభిస్తుంది.