PCOD : సాధారణంగా ఎక్కువగా గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదం పురుషులలో ఎక్కువగా ఉంటుందని అంటారు. కానీ మహిళల్లో పీరియడ్స్ సక్రమంగా లేకపోవడం వల్ల గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదం పెరుగుతోందనే విషయం చాలా మందికి మాత్రం అసలు తెలియదు. అవును మీరు విన్నది నిజమే PCOD, ఊబకాయం, గాలి కాలుష్యం (Obesity and air pollution)వంటి వాటి వల్ల మహిళల్లో గుండె జబ్బులు ఎక్కువగా పెరుగుతున్నాయి. ప్రస్తుత కాలంలో మహిళల్లో గుండెపోటు(heart attack) కారణంగా మరణాల సంఖ్య గణనీయంగా పెరగడానికి ఇదే ప్రధాన కారణం అని డాక్టర్లు కూడా తెలుపుతున్నారు.
అసలు ఈ పిసిఒడి అనేది జీవనశైలి వ్యాధి. అనారోగ్యకరమైన జీవనశైలి, ఎక్కువుగా జంక్ ఫుడ్ తినడం, తక్కువ నిద్ర, ఒత్తిడి, ఊబకాయం లాంటి అనేక కారణాల వల్ల మహిళల్లో పీరియడ్స్ (Periods)క్రమం తగ్గుతాయి. ఈ కారణాలుతో చాల మందికి మహిళల్లో గుండెపోటుకు కారణమవుతున్నాయి. నేటి కాలంలో మహిళల్లో కనిపించే అత్యంత సాధారణ సమస్యగా PCOD ఉద్భవిస్తోంది. ఇందులో బరువు పెరగడం, ఇన్సులిన్ నిరోధకత, మధుమేహం, ఆండ్రోజెన్‌లు అధికంగా ఉండటం వంటి లక్షణాలు ఉన్నవారిలో ఈ సమస్య ఎక్కువగా వస్తుంది. ఇక .PCODని నివారించే మార్గాలు ఏమిటంటే.. బరువును నియంత్రణలో ఉంచుకోవాలి. అలాగే ప్రతి రోజూ వ్యాయామం చేయడం. ఎటువంటి ఒత్తిడి లేకుండా యోగా లేదా ధ్యానం చేయాలి. ప్రతి రోజు కూడా 7 నుండి 8 గంటల పాటు తగినంత నిద్ర పోవడం.అలాగే ఎవరికైనా ధూమపానం, మద్యపానం అలవాటు ఉంటె మానుకోవాలి .