Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Pomegranate Leaves: దానిమ్మ ఆకుల్లో లాభాలే లాభాలు

Pomegranate Leaves: ప్రస్తుత రోజులలో చాల మంది అనేక ఆరోగ్య సమస్యలను (HEALTH PROBLESM) ఎదురుకుంటున్నారు.ఈ క్రమంలో చాల మంది పండుళ్లు, డ్రై ఫ్రూప్ట్స్ (dry fruits) లాంటివి తీసుకుంటారు. ఈ క్రమంలో దానిమ్మ పండు తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదని అందరికి విదితమే. నిజానికి దానిమ్మ పండు మాత్రమే కాదు, దాని దానిమ్మ ఆకులు అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా పొందవచ్చు. ఇది మీకు ఆశ్చర్యం కలిగించవచ్చు కానీ ఇది నిజం. నిజానికి ఆయుర్వేదంలో దానిమ్మ ఆకులను వివిధ రకాల వ్యాధులను నయం చేయడానికి వాడుతారు. తరచుగా వచ్చే కాలానుగుణ దగ్గు. జలుబు నుండి ఉపశమనం పొందడానికి ఈ పండు యొక్క ఆకుల కషాయాన్ని తయారు చేసి రోజుకు రెండుసార్లు తాగితే చాలు. ఇవే కాకుండా వివిధ రకాల చిన్న ఆరోగ్య సమస్యలకు దానిమ్మ ఆకులు చక్కగా ఉపయోగపడతాయి.. అవి ఏమిటంటే..

ఆయుర్వేదంలో దానిమ్మ ఆకులను కుష్టు వ్యాధి, చర్మ వ్యాధులను (Leprosy and skin diseases)నయం చేయడానికి వాడుతారు. దానిమ్మ ఆకులు నిద్రలేమికి బెస్ట్ రెమిడీ అని అంచనా. ఒక పాత్రలో మూడు వంతుల నీరు తీసుకోండి. దానిమ్మ ఆకులను పేస్ట్‌లా చేసి అందులో నీళ్లలో వేసి.. వాటర్ సగానికి తగ్గే వరకు బాగా మరగపెట్టాలి. రోజూ రాత్రి పడుకునే ముందు ఈ నీటిని ఫిల్టర్ చేసి తాగితే మాత్రం నిద్రలేమి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. రాత్రిఅంతా బాగా నిద్రపోవడానికి (sleep)బాగా సహాయపడుతుంది.

అలాగే మనలో ఎవరైనా దురద, తామర (Itching, eczema) వంటి చర్మ సంబంధిత వ్యాధులతో బాధపడుతుంటే దానిమ్మ ఆకులను పేస్ట్ చేసి రాసుకుంటే చాల సులువుగా ఆ సమస్యల నుంచి బయట పడవచ్చు. అంతేకాదు శరీరంలోని పుండ్లు, గాయాలకు దీన్ని రాస్తే త్వరగా నయం కూడా అవుతుంది. అలాగే చెవి ఇన్ఫెక్షన్లు, నొప్పితో బాధపడేవారు దానిమ్మ ఆకులను చూర్ణం చేసి దాని రసాన్ని తీసి, నువ్వులు లేదా ఆవనూనెతో కలిపి ఈ మిశ్రమాన్ని రెండు చెవుల్లో వేయాలి. ఇలా చేస్తే చెవి నొప్పి, ఇన్ఫెక్షన్లు కూడా త్వరగా తగ్గుతాయి.

అలాగే ఎవరికైనా నోటి దుర్వాసన, చిగుళ్ల సమస్యలు, నోటిపూత ఉంటే దానిమ్మ ఆకుల (Pomegranate Leaves) రసాన్ని నీటిలో కలిపి ఆ నీటితో పుక్కిలించాలి. ఇలా చేయడం వల్ల నోటికి సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి. అలాగే ముఖంపై మొటిమలు తగ్గాలంటే దానిమ్మ ఆకులను పేస్ట్ లా చేసి మొటిమల మీద రాస్తే ముఖం మచ్చలు లేకుండా తయారవుతుంది. మీకు ఎవరికైనా తరచుగా అజీర్ణం, మలబద్ధకం, గ్యాస్, విరేచనాలు వంటి సమస్యలతో బాధపడుతుంటే, రోజూ రెండు టీస్పూన్ల దానిమ్మ ఆకుల (Pomegranate Leaves) రసం తీసుకోండి లేదా ఈ ఆకులను జీలకర్ర, మిరియాలతో మెత్తగా చేసి పెరుగుతో తాగితే సరి ఈ సమస్యల నుంచి బయట పడవచ్చు.