Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Sleeping After Bath: స్నానం చేయగానే నిద్రపోతే చాలా డేంజర్..?

చాలామంది రాత్రి పడుకునే ముందు స్నానం (Bath) చేయడాన్ని ఇష్టపడతారు. ఇది శరీరాన్ని శుభ్రపరచి, రిలాక్స్ చేస్తుందని భావిస్తారు. కానీ, శాస్త్రవేత్తలు చెప్పేది మరో విషయం. వాళ్లు ఏమంటున్నారంటే స్నానం చేయగానే నిద్రపోతే (Sleeping after bath) చాలా ప్రమాదం అని పేర్కొంటున్నారు. స్నానం చేయడం వల్ల శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఇది శరీరానికి నిద్రపోవాలనే సిగ్నల్‌ను పంపడానికి అడ్డుపడుతుంది. ఫలితంగా, నిద్రలేమి, నిద్రలో ఆటంకాలు వచ్చే అవకాశం ఉంది. రాత్రి చేసే స్నానం మెదడు సహజమైన నిద్ర చక్రాన్ని భంగపరుస్తుంది. దీంతో మనం మరుసటి రోజు అలసిపోయి, మానసికంగా కుంగిపోయి ఉంటాం.

తడి జుట్టుతో నిద్రించడం వల్ల జుట్టు రాలడం (Hair fall), చుండ్రు (Dandruff), ఇతర జుట్టు సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే తడి ప్రాంతంలోనే బ్యాక్టీరియా ఎక్కువగా పెరుగుతుంది. దిండు లేదా తల కింద పెట్టుకునే మెత్త కూడా తడిగా తయారైతే ఇబ్బంది. అలాగే, తరచూ వేడి నీటితో స్నానం చేయడం వల్ల చర్మం పొడిబారడం, దురద వంటి సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. కంటి సమస్యలు కూడా వస్తాయి. ముఖ్యంగా వేడి నీటితో స్నానం చేస్తే కళ్ళు ఎర్రగా మారుతాయి. నైట్ పూట మరి లేటుగా స్నానం చేస్తే కీళ్లు తిమ్మిరి ఎక్కి వివిధ రకాల సమస్యలు వస్తాయి.

అయితే, ఎప్పుడు స్నానం చేయాలి?

నిద్రించడానికి కనీసం 2-3 గంటల ముందు స్నానం చేయడం మంచిది. గోరువెచ్చని నీటి (Warm water)తో స్నానం చేయడం మంచిది. స్నానం చేసిన తర్వాత జుట్టును బాగా ఆరబెట్టుకోవాలి. స్నానం చేసిన తర్వాత కూడా మెదడు చురుగ్గానే ఉంటుంది. దీంతో మరుసటి రోజు మనం అలసిపోయి, మానసికంగా కుంగిపోయి ఉంటాం. అందుకే స్నానం చేస్తే వెంటనే నిద్రకు ఉపక్రమించకుండా కొద్దిసేపు వెయిట్ చేయడం మంచిది. వీలైనంతవరకు సాయంత్రం ఆరేడు గంటల ఫస్ట్ స్నానం చేయడం మంచిది. ఎక్కువగా శారీరక శ్రమ చేయని వారు ఉదయం వేళ గోరువెచ్చని నీటితో స్నానం చేస్తే చాలు.