Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Street Food: రోడ్డు పక్కన తినుబండారాలతో తిప్పలే.. అవేమిటో తెలుసా

Street Food: ప్రస్తుత రోజులలో ప్రతి ఒక్కరు కూడా జంక్ ఫుడ్స్ (junk foods) కి బాగా అలవాటు పడ్డారు. అందులో భాగంగానే రోడ్డు పక్కన లభించే నూడిల్స్, పానీపూరి, పళ్ల రసాలు, రంగునీళ్లు, మురి మిక్చర్, దోశ బళ్లు ఇలా ఎన్నో తింటూ అనేక ఆరోగ్యసమస్యలను కొని తెచ్జుకుంటున్నారు. అవి ఏమిటంటే..

–టైఫాయిడ్- పేగుల్లో పుళ్లు ఏర్పడి, జ్వరం వస్తుంది. బాగా బాధిస్తుంది.

— జియర్డియాసిస్- నీళ్ల విరేచనాలు అవుతాయి.

— ఈ కోలి బాక్టీరియా (backteria) వలన విషపూరిత ఆహారం- తిన్న రెండుగంటల్లో వాంతులు, కడుపునొప్పి, నీళ్ల విరేచనాలు.

— హెచ్ పైలోరి – కడుపులో మంట, జీర్ణాశయంలో పుళ్లు (Stomach inflammation, stomach ulcers), అవి పగిలి లోపలే రక్తస్రావం అవ్వటం.

— షిగెల్లోసిస్- జిగటతో కూడిన రక్త విరేచనాలు.

–కలరా – ఇది కడిగిన బియ్యం నీళ్లరంగు విరేచనాలు, ఆగకుండా అవుతాయి, ఏమాత్రం వైద్యం ఆలస్యమైనా ప్రాణం టప్పున పోతుంది.

— ఎంటమీబా- పెద్దపేగులో పుళ్ళు చేసి, అలాగే రక్తం లోకెళ్లి కాలేయం (లివర్) తినేస్తుంది.

–టీనియా – బద్దెపురుగు బాగా పొడవుగా పెరిగి, గుడ్లు పెట్టి, ఆ గుడ్లు మెదడులోకెళ్లి మూర్ఛరోగానికి దారి తీస్తాయి.

–వైరల్ విరేచనాలు, వాంతులు.

— ఇలా రకరకాల నులిపురుగులు – రాత్రంతా దురదతో నిద్ర పట్టకుండా ఇబ్బంది పడడం .

ఇలా చాల ఆరోగ్యవంతుల్లో వస్తాయి. ఇక ఈ రోగాలకు (diseases) వైద్యం కూడా ఉంది. అయితే సాధారణంగా ఎక్కువగా మందు తాగేవాళ్లు, రోగనిరోధకశక్తి తక్కువ ఉన్నవాళ్లు ఈ రకమైన ఇన్ఫెక్షన్ల (infections)భారిన పడుతూ ఉంటారు. ఒకేసారి కాలేయం, కిడ్నీలు రెండూ పనిచేయడం మానేసి ఐసీయూ వరకూ వెళ్లి మృతి కూడా చెంతుతారు. ఇలాంటి రోగాలతో తెలుగు సినీ నటులు ఇద్దరు చనిపోయినవాళ్లు కూడా మనకు తెలుసు. మనం జాగ్రత్తగా ఉండాలంటే వండుకుని తినండి. తప్పదంటే తినండి. ఏమీ కాకపోతే మన అదృష్టం. ఈదిన రోగంభారిన పడితే మాత్రం వైద్యుడ్ని దగ్గరికి వెళ్లడం మంచిది.

ఐక్య భారతీయ ఆహారం ఎంతో వైవిధ్యమైంది, రుచికరమైనది మరియు అనేక పోషకాలూ ఉండి సంపూర్ణమైనది. దానిని విమర్శించటం నా ఉద్దేశ్యం ఏమి కాదు. అపరిశుభ్ర వాతావరణంలో తయారుచేసిన ఆహారం, కలుషిత నీరు వాడటం, వంటవండేవారు వ్యక్తిగత శుభ్రత పాటించకపోవటం మన ఆరోగ్యానికి (health)కలిగే చెడును తెలపడమే నా ఉద్దేశ్యం అని Dr .శ్రీకాంత్ అంటున్నారు.