Weight Loss: ఈ రోజుల్లో వెయిట్ చేయించడం చాలా ఈజీ కానీ తగ్గడం మాత్రం అంత సులభమైన పనేం కాదు. రోజు ఉదయం లేదంటే సాయంత్రం గంటలు తరబడి నడిచినా లేదా జిమ్ (jim)లో వర్కౌట్స్ చేసినా ఎక్స్‌ట్రా కిలోలు అనేది తగ్గించుకోలేకపోతున్నారు. అలాంటి వారికి ఆకుకూర (leafy vegtablest) ఒకటి పరిష్కారం అవుతుంది. గోతు కోలా లేదా బ్రహ్మి ఆకులు బరువు తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయని హెల్త్ ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు. ఈ మొక్కలో ఔషధ గుణాలున్నాయి. జ్ఞాపకశక్తి పెంపొందించడంలోనూ ఈ ఆయుర్వేద మూలిక కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
ఆయుర్వేద గుణాలు కలిగిన గోతు కోలా ఆకులను తింటే కొన్ని రోజుల్లోనే బరువు తగ్గవచ్చని కూడా సలహా ఇస్తున్నారు. ఈ మధ్య కాలంలో చాలామంది బరువు పెరుగుదల (weight gain)సమస్యతో బాధపడుతున్నారు. ముఖ్యంగా యువతలో పొట్ట, నడుము చుట్టూ భాగాల్లో కొవ్వు పట్టడం చాలా సాధారణంగా మారింది. దీనికి కారణం మనం తినే ఆహారం, జీవన శైలి అలవాట్లు. బరువు ఎక్కువగా ఉంటే రక్తపోటు, గుండె జబ్బులు, షుగర్ వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఎక్కువ. సినీ నటీనటుల వలె అట్రాక్టివ్ ఫిట్‌నెస్‌ను పొందాలని చాలామంది ప్రయత్నిస్తారు. వీరందరికీ గోతు కోలా ఆకులు (leafes) మంచి ఔషధంగా నిలుస్తుందని ప్రముఖ పోషకాహార నిపుణులు నిఖిల్ వట్స్ చెప్పారు. ఈ ఆకును తింటే సులభంగా ఫిట్‌నెస్‌ను పొందవచ్చని తాజాగా వెల్లడించారు.
గోతు కోలా శాస్త్రీయంగా సెంటిల్లా ఎసియాటికా అని, సంస్కృతంలో మండూకపర్ణి అని అంటారు. ఆయుర్వేదంలో చాలా కాలంగా దీన్ని ఉపయోగిస్తారు. ఇది చాలా రకాల వ్యాధులకు మందుగా పనిచేస్తుంది. గోతు కోలా ఆకుల్లో కొవ్వును కరిగించే గుణాలు ఉన్నాయి. ఇవి శరీరంలోని అదనపు కొవ్వును తగ్గించడానికి సహాయపడతాయి. అందుకే, ఇది బరువు తగ్గడానికి మంచి మందుగా పనిచేస్తుందని అంటారు.
గోతుకోల ఆకులను ఎలా తీసుకోవాలి?
బరువు (weight)తగ్గాలనుకుంటే మొదట గోతు కోలా ఆకులను బాగా కడగాలి. ఆ తర్వాత వాటిని మెత్తగా రుబ్బి పేస్ట్ చేయాలి. ఈ పేస్ట్‌ను ఉదయం లేవగానే ఉదయాన్నే ఖాళీ కడుపుతో వెచ్చటి నీటిలో లేదా పాలలో కలిపి తాగాలి. ఇలా రోజూ చేస్తే కొన్ని రోజుల్లో శరీరంలోని కొవ్వు తగ్గడం మొదలవుతుంది.