Revanth reddy: పదమూడు ఎంపీలు గెలుస్తాం పదేళ్ళు రాష్ట్రాన్ని పరిపాలిస్తాం
రాష్ట్రం లోని 17 లోక్ సభ స్థానాల్లో పద మూడు పార్లమెంటు స్థానాలు పక్కాగా గెల వబోతున్నామని తెలంగాణ ముఖ్య మంత్రి ఎను ముల రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
మెదక్‌లోనే కాస్తా పోటీ, ఆరుస్థా నాల్లో బీఆర్‌ఎస్‌కు డిపా జిట్ల కష్టం
కంటోన్మెంట్‌లో 20 వేల మెజారి టీతో గెలుస్తున్నాo
సన్న వడ్లు పండిస్తేనే రూ.500 బోనస్ ఇవ్వనున్నాం
రైతుల పంట ఉత్పత్తులు రేషన్ షాపుల ద్వారా పేదలకు పంపిణీ చేస్తాం
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అసెం బ్లీలోనే వెళ్లాడిస్తాం
ఏపీలో సీఎం అయినా సత్సంబం ధాలు పెట్టుకుంటాం
కేంద్రపాలిత ప్రాంతం విఫల ప్రయో గం సమస్యలు శాశ్వతంగా పరిష్క రించుకుంటాం
మీడియాతో చిట్‌చాట్‌లో తెలంగా ణ సీఎం రేవంత్‌రెడ్డి
ప్రజా దీవెన హైదరాబాద్: రాష్ట్రం లోని 17 లోక్ సభ స్థానాల్లో పద మూడు పార్లమెంటు స్థానాలు పక్కాగా గెల వబోతున్నామని తెలంగాణ ముఖ్య మంత్రి ఎను ముల రేవంత్ రెడ్డి(Revanth Reddy) ధీమా వ్యక్తం చేశారు. వచ్చే పదేళ్ల కాలంలో తాము పరిపాలనలో ఉండబోతు న్నామని, రానున్న వందేళ్ల అభివృ ద్ధి ప్రణాళికలు తయారు చేసి ప్రజల కు అందించడం తన బాధ్యత అని పేర్కొన్నారు. అదే సందర్భంలో ఆ రేడు సీట్లలో బీఆర్ఎస్ కు డిపా జిట్ గల్లంతు కానుందని కేవలం మెదక్(Medak) స్థానంలోనే కాస్త కూస్తో పోటీ ఇవ్వగలరని వ్యాఖ్యానించారు.డి పాజిట్ కూడా రాదని సీఎం రేవంత్ అన్నారు. నల్లగొండ, ఖమ్మం, వరం గల్ పట్టభద్రుల ఎమ్మె ల్సీ ఉప ఎ న్నికపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం సమీక్ష నిర్వహించా రు.బీజేపీని తమకు ప్రత్యర్థిగా బీఆర్ఎస్ బలవంతంగా సృష్టిం చిందని ఆరోపించారు.
దేశంలో, రాష్ట్రంలోనూ మోదీ(Modi) వేవ్ లేదని, బీఆర్ఎస్ ఆ పార్టీ యంత్రాంగం మొత్తాన్ని బీజేపీకి అప్ప గించిందని ఆరోపించారు. రాజకీయాల్లో హత్య లు ఉండవని, ఆత్మహత్యలే ఉంటా యని వ్యాఖ్యానించారు. దేశ వ్యా ప్తంగా ఎన్డీయేకు పది శాతం కాస్తా అటు ఇటుగా 220 సీట్లు వస్తాయని తెలిపారు. కంటోన్మెంట్ అసెంబ్లీ(Assembly) ఉప ఎన్నికలో తమ అభ్య ర్థి 20 వేల మెజారిటీతో గెలుస్తామ ని ధీమా వ్యక్తం చేశారు. ఏపీలో ఎవరు ముఖ్యమంత్రి అయినా వారితో సత్సం బంధాలు పెట్టుకుం టామని, రెండు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలను శాశ్వతంగా పరిష్కరించుకుంటా మని స్పష్టం చేశారు.
రాష్ట్రంలో రైతు కార్పొరేషన్…..
రాష్ట్రం లో రైతు సంక్షేమ కార్పొరేష న్‌ను ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ఆ కార్పొ రేషన్ ద్వారా ఆదాయం చూపించి రుణం తీసుకుంటామని, దాని ద్వా రానే రైతుల రుణమాఫీ అమలు చేస్తామని ప్రకటించారు. మంగళవా రం తన నివాసంలో మీడియాతో ముఖ్య మంత్రి చిట్‌చాట్‌గా మాట్లా డారు. లోక్‌సభ ఎన్నికలు(Lok Sabha elections) రాష్ట్రంలో ముగి సినందున ఇక పరిపాలనపైనే వంద శాతం దృష్టి పెడతామని, బుధవా రం నుంచి సచివాలయా నికి వెళతానని చెప్పారు. ముందు గా తడిసిన ధాన్యం కొనుగోలు చే యడంపై, పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంపై ఫోకస్ చేస్తా మన్నారు. వీటితోపాటు రైతు రుణమాఫీ అంశం, విద్యాసంవ త్సరం ప్రారంభం కానున్న నేపథ్యం లో పాఠ్యపుస్త కాలు, పాఠశాలల్లో సంస్కరణలు, హాస్టళ్లకు సన్నబి య్యం సరఫరా వంటి వాటిపైనా దృష్టి సారిస్తామన్నారు.
పాలనలో భాగంగా ఆకస్మిక తనిఖీలు, పర్యట నలు కూడా ఉంటాయని చెప్పారు. రుణ మాఫీకి సంబంధించి త్వరలో నే ఎస్‌ఎల్‌బీసీ సమావేశాన్ని ఏర్పా టు చేసి రైతులకు(Farmers) ఎంత మేరకు రుణా లు ఉన్నాయన్నది అంచనా వేస్తామన్నారు. రైతుల రుణాలను బ్యాంకుల నుంచి ప్రభుత్వం బదలా యించుకునేందుకు ఆర్‌బీఐ అంగీకరించబోదన్న మాజీ మంత్రి హరీశ్‌రావు వ్యాఖ్యలపై స్పందిస్తూ ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితికి లోబడి రుణం తీసుకుంటే ఆర్‌బీఐ(RBI) ఎందు కు అంగీకరించదని ప్రశ్నించారు. రైతు రుణమాఫీ, రైతు భరోసా, ధరణి తదితరాలన్నింటిపైనా శాసనసభలో చర్చిస్తామని, సభలో చర్చకు పెట్టకుండా ఏదీ చేయ బోమని స్పష్టం చేశారు. అఖిలప క్షాలు, స్టేక్ హోల్డర్లతోనూ చర్చిస్తా మన్నారు. రాష్ట్ర బడ్జెట్ సమావేశా లు ఉంటాయని, కేంద్రం నుంచి వచ్చే నిధుల వెసులు బాటును చూసుకునే రాష్ట్ర బడ్జెట్ ఉంటుం దని వెల్లడించారు. అందుకే రైతు రుణమాఫీకి ఆగస్టు 15 గడువు పెట్టుకున్నట్లు చెప్పారు.
రేషన్ షాపుల ద్వారా పంటల పంపిణీ.. రైతులు పండించే వరి, ఇతర పంటలను పౌరసరఫరాల సంస్థ ద్వారా గిట్టుబాటు ధర ఇచ్చి సేకరిస్తామని, వాటిని ఉత్పత్తుల కింద మార్చి రేషన్ షాపుల ద్వారా పేదలకు పంపిణీ చేస్తామని సీఎం తెలిపారు. గతంలో కాంగ్రెస్(Congress) ప్రభు త్వం రేషన్ షాపుల ద్వారా బియ్యం తోపాటు తొమ్మిది రకాల వస్తువు లను సర ఫరా చేసిందని గుర్తు చేశారు. రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం ఇస్తామని ఎన్నికల మేనిఫె స్టోలో హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేస్తూ రైతులు ఆ వడ్లు పం డించేలా ప్రోత్సహిస్తామని చెప్పా రు. సన్న వడ్లు పండించే రైతులకు క్వింటాలుకు మద్దతు ధరపై రూ.50 0 బోనస్ ఇచ్చి సేకరిస్తామని చెబుతామన్నారు. అప్పుడు రైతు లు కూడా సన్న వడ్లు పండిం చేందు కు ముందుకొస్తారని తెలిపారు.
రేషన్ కార్డుల మంజూరు అనేది నిరంతర ప్రక్రియ అని సీఎం రేవంత్ అన్నారు. వీటితోపాటు అన్ని కార్య క్రమాలకు సంబంధించి గ్రామసభల్లో తీసుకున్న దరఖాస్తులను కంప్యూ టరైజ్ చేసినట్లు చెప్పారు. రిటైర్ అయి కూడా వివిద శాఖల్లో కొనసాగుతున్న అధికారులు వెయ్యి మందికి పైగా ఉన్నారని వెల్లడిం చారు. మంత్రివర్గ సమావేశంలో చర్చించి వారి విషయంలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. కర్ణాటక(Karnataka) లో కరువు పరిస్థి తులున్నా వారిని ఒప్పించి రాష్ట్రంలో తాగునీటి అవ సరాల కోసం రెండున్నర టీఎంసీల కృష్ణా నీటిని ఆ రాష్ట్రం నుంచి తెచ్చామని గుర్తు చేశారు. 59 జీవో ను అబయన్స్ లో పెట్టామని, ఎన్ని కల కోడ్ ముగిసిన తర్వాత సమీక్షి స్తామని అన్నారు. ఫోన్ ట్యాపింగ్(Phone tapping) సంబంధిత అంశాలను అసెంబ్లీకే చెబుతామన్నారు. ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే వర్సిటీలకు కొత్త వీసీలను నియమిస్తామని చెప్పా రు.
కరెంటు విషయంలో హరీశ్ రావు(Harish Rao)ఒక మెకానిజం ఏర్పాటు చేసి,ఎన్నికల్లో ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవాలని చూశారని ఆరోపిం చారు. ఇందుకు సంబంధించి కొన్ని కేసులను గుర్తించి నమోదు చేశామ న్నారు.ఇక మూసీ నదిని రాష్ట్రానికి ఆదాయాన్నందించే వనరుగా మారుస్తామని, కన్నల్టెన్సీ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటా మని చెప్పారు. కేసీఆర్(KCR) మాదిరిగా తాను మేధావిని కాకపోవడం వల్లనే కన్సల్టెన్సీ నివేదికలపై ఆధారపడు తున్నానని రేవంత్ ఎద్దేవా చేశారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం వల్ల మెట్రోను అమ్ముకునే పరిస్థితి వస్తుందన్న యాజమాన్యం వ్యాఖ్య లపై సీఎం(CM) స్పందిస్తూ వాళ్ల ఆస్తిని వాళ్లు అమ్ముకుంటానంటే ఎవరు వద్దన్నారని ప్రశ్నించారు. హైదరాబా దన్ను కేంద్రపాలిత ప్రాంతం చేస్తార ని ఎవరైనా అంటే అంత తెలివిలేని వాడు ఇంకొకడు ఉండడన్నారు. యూటీ అనేది స్టాప్ గ్యాప్ మాత్ర మేనని, అది విఫల ప్రయోగం అని వ్యాఖ్యానించారు.
13 mp seats win in telangana