Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Total polling: పోస్టల్ తో కలిపి పోలింగ్ 66.30 శాతం

లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో ప్రత్యక్ష ఓటింగ్ తో పాటు బ్యాలెట్ ఓటింగ్ కలిపి రాష్ట్రంలో 66.3 శాతం పోలిం గ్ శాతం నమోధైంది.

ఎన్నికల తుది గుణాంకాలు వెల్ల డించిన ఎన్నికల సంఘం
అత్యధికంగా భువనగిరి 76.78 శాతం, 48.48 శాతం అతిలో హైదరాబాద్
జూన్‌ 4వ తేదీన 34 కేంద్రాల్లో పగడ్బంధిగా ఓట్ల లెక్కింపు
రాష్ట్ర ఎన్నికల సంఘం సీఈవో వికాస్‌రాజ్‌

ప్రజా దీవెన, హైదరాబాద్‌: లోక్ సభ ఎన్నికల్లో(Lok Sabha elections) తెలంగాణలో ప్రత్యక్ష ఓటింగ్ తో పాటు బ్యాలెట్ ఓటింగ్ కలిపి రాష్ట్రంలో 66.3 శాతం పోలిం గ్ శాతం నమోధైంది. ఈ మేరకు లోక్‌సభ ఎన్ని కలకు సంబంధించిన పోలింగ్‌(Polling) శాతం తుది గణాంకాలను రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌రాజ్‌ మంగళవారం వెల్లడిం చారు. 17 నియోజకవర్గాల్లో ప్రత్య క్ష పోలింగ్‌ 65.67% నమోదైందని వికాస్‌రాజ్‌ తెలిపారు. గత లోక్‌సభ ఎన్నికలతో పోలిస్తే ఈసారి పోలింగ్‌ 3% పైగా పెరిగిందని, పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లతో కలిపి 66.3 శాతం దాటిందని వివరించారు. జూన్‌ 4వ తేదీన 34 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు చేపడతామన్నారు. కాగా, పోలింగ్‌ లో భువనగిరి (76.78) ప్రథమ స్థానంలో నిలవగా, అత్యల్పంగా హైదరాబాద్‌లో 48.48% పోలింగ్‌ జరిగిందని పేర్కొన్నారు.

అసెంబ్లీ(Assembly) నియోజకవర్గాల వారీగా చూస్తే నర్సాపూర్‌లో అత్యధికంగా 84.25 శాతం, మలక్‌పేటలో అత్యల్పంగా 42.76 శాతం నమోదైందన్నారు. కాగా, రాష్ట్రంలో 3,32,16,348 మంది ఓటర్లకు గాను, 2,20,2 4,806 మంది ఓటు వేసినట్లు పేర్కొన్నారు. 35,809 పోలింగ్‌ స్టేషన్ల పరిధిలో 2,18,14,035 (65.67 శాతం) మంది, పోస్టల్‌ బ్యాలెట్‌లో 2,10,771 మంది హక్కు వినియోగించుకున్నారని వెల్లడించారు. పోలింగ్‌ శాతం పెంపునకు క్షేత్రస్థాయు యంత్రాంగం చేసిన కృషికి తగిన ఫలితం దక్కిం దన్నారు. అన్ని పోలింగ్‌ స్టేషన్ల నుంచి ఈవీఎంలను భద్రతా బల గాల సహకారంతో స్ట్రాంగ్‌ రూముల్లో(strong rooms)చేర్చినట్లు వికాస్‌రాజ్‌ చెప్పారు.

44 స్ట్రాంగ్‌రూములకు నలువైపులా సీసీ కెమెరాలు, కట్టుది ట్టమైన చర్యలు చేపట్టామన్నారు. లోక్‌సభ నియోజకవర్గాల వారీగా పోలింగ్‌ శాతం చూస్తే ఆదిలాబాద్‌ 74.03, భువనగిరి 76.78, చేవెళ్ల 56.50, హైదరాబాద్‌ 48.48, కరీంనగర్‌ 72.54, ఖమ్మం 76.09, మహబూబాబాద్‌ 71.85, మహ బూబ్‌నగర్‌ 72.43, మల్కాజిగిరి 50.78, మెదక్‌ 76.09, నాగర్‌క ర్నూల్‌ 69.46, నల్లగొండ 74.02, నిజామాబాద్‌ 71.92, పెద్దపల్లి 67.87, సికింద్రాబాద్‌ 49.04, వరంగల్‌ 68.86, జహీరాబాద్‌ 74.63 శాతం పోలింగ్‌ నమోదైంది.

66.3 percentage polling in telangna