–రోడ్డుపై నడుచుకుంటూ వెళ్లే వ్యక్తి కి కారు ఢీకొని దుర్మరణం
— హైదరాబాద్ పరిధిలోని గాజుల రామారం వద్ద సంఘటన
Accident: ప్రజా దీవెన, హైదరాబాద్: మద్యం మత్తులో మతిలేక అతివేగంతో కూడిన నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలయింది. మద్యంతో పాటు మాదక ద్రవ్యాల మత్తులో నడి రోడ్డు (Nadi Road) పై కొందరు చేసే అరాచకాల వల్ల ఎన్నో కుటుంబాలు వీధిన పడుతున్నాయి. తాజాగా హైద రాబాద్ పరిధిలో ఓ కారు బీభత్సం సృష్టించింది రోడ్డు వెంట నడుచు కుంటూ వెళ్తున్న వ్యక్తి ప్రాణాలను తీసింది. మద్యం మత్తులో (Alcohol intoxication) ఉన్న కారు డ్రైవర్ అతివేగంతో రోడ్డు వెంట నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిని ఢీకొట్టగా అక్కడికక్కడే మరణించాడు. ఈ ఘటన హైద రాబాద్ నగర పరిధిలోని గాజులరా మరంలో చోటుచేసుకుంది.
మేడ్చల్ జిల్లా జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరి ధిలోని గాజులరామారంలో ఈ ఘటన జరిగింది. అతివేగం, మద్యం మత్తులో (Speeding, under the influence of alcohol) ఉన్న కొందరు యువకులు కారులో వస్తున్నారు. ఈ క్రమంలో నడుచుకుంటూ వెళ్తు న్న సెక్యూరిటీ గార్డును కారు ఢీకొ ట్టగా గోపి (38) అనే సెక్యూరిటీ గార్డు ఘటనాస్థలి లోనే మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధిం చిన దృశ్యాలు అక్కడున్న సీసీ కెమె రాల్లో రికార్డయ్యాయి. ఈ ఘోర ప్రమాదం ఓ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపిందని తాగి డ్రైవ్ (Drunk, drive)చేస్తున్న యువకులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.