Kush and Oj drugs : మాదక ద్రవ్యాల ముఠా గుట్టురట్టు
మాదక ద్రవ్యాల రహిత రాష్ట్రంగా తీర్చిది ద్దేందుకు ప్రభుత్వం ఓ వైపు డ్రగ్స్ మాఫియా ఆగడాలు అడ్డూ అదు పు లేకుండా కొనసాగుతూనే ఉన్నా యి.
రూ.10లక్షల ఆఫ్రికా, అమెరికాల్లో లభించే కుష్, ఓజీ డ్రగ్స్ స్వాధీనం
ప్రజా దీవెన, హైదరాబాద్: మాదక ద్రవ్యాల రహిత రాష్ట్రంగా తీర్చిది ద్దేందుకు ప్రభుత్వం ఓ వైపు డ్రగ్స్ మాఫియా ఆగడాలు అడ్డూ అదు పు లేకుండా కొనసాగుతూనే ఉన్నా యి. హైదరాబాదులో డ్రగ్స్ అమ్మకా లు జోరుకు అడ్డుకట్ట పడే పరిస్ధితు లు కనిపించడం లేదు. అధికారు లు డ్రగ్స్ రహిత రాష్ట్రంగా చేసేం దుకు ఎన్ని చట్టాలు, చర్యలు తీసు కువస్తున్నా డ్రగ్స్ మాఫియా ఆగడా లు ఏదో రూపంలో పెరుగుతున్నా యి. తాజాగా ఎక్సైజ్ పోలీసులు మరోసారి హైద రాబాద్ లో డ్రగ్స్ ముఠా గుట్టురట్టు చేశారు. ముంబై నుంచి అక్రమంగా తీసుకొచ్చి హైద రాబాద్ లో అమ్మా లని చూస్తున్న కుష్, ఓజీ డ్రగ్స్ ను లాలాగూడలో ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నారు. కాగా పట్టుబడిన డ్రగ్స్ విలువ రూ. 10 లక్షల వరకు ఉంటుందని అధి కారులు తెలిపారు. ఈ కుష్, ఓజీ డ్రగ్ ఆఫ్రికా, అమెరికాలో ఎక్కువగా లభిస్తుందని, ఇది అత్యంత ప్రమా దకరమని నిపుణులు తెలుపు తున్నారు. ఈ డ్రగ్ కారణంగా లివర్, కిడ్నీ సమస్యలు వస్తాయని వెల్లడించారు. వీరిని డ్రగ్స్‌తో పట్టు కుని విచారిస్తున్నట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు.
Africa and America Kush and Oj drugs seized