Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Air Force Maneuvers: ఆకట్టుకున్న ఎయిర్ ఫోర్స్ విన్యాసాలు

ప్రజా దీవెన, హైదరాబాద్: హైదరాబాద్ నడిబొడ్డున హుస్సే న్‌సాగర్ గగనతలంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఏఐఎఫ్ విన్యాసాల ను ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి పలువురు మంత్రులతో కలిసి వీక్షించారు. ప్రజా పాలన, ప్రజా విజయోత్సవాల్లో భాగంగా ఇం డియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన సూర్యకిరణ్ ఎరోబాటిక్ టీమ్ అద్భుతమైన విన్యాసాలను ప్రద ర్శించింది.

తొమ్మిది జెట్ విమా నాలతో నిర్వహించిన విన్యాసాలు సర్వత్రా నగర ప్రజలను అలరించా యి. ట్యాంక్‌బండ్ నుంచి ముఖ్య మంత్రి , ఇతర మంత్రులు, ప్రజా ప్రతినిధులు ఈ విన్యాసాలను వీక్షించగా, ట్యాంక్‌బండ్‌తో పాటు నెక్లెస్ రోడ్డు మార్గం, పరిసర ప్రాం తాల నుంచి అశేష ప్రజానీకం ఈ అద్భుత కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షించారు.

ఈ కార్యక్రమానికి శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, డి.శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారులు కె. కేశవరావు, మహమ్మద్ అలీ షబ్బీర్, వేం నరేందర్ రెడ్డి, నగర మేయర్ గద్వాల విజయలక్ష్మితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారితో పాటు ఇతర అధికారు లు హాజరయ్యారు.