Air India: ప్రజా దీవెన, హైదరాబాద్: శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ టర్నేషనల్ విమానాశ్రయంలో (Rajiv Gandhi International Airport) ఎయిర్ ఇండియా (Air India)విమానం అ త్యవసర ల్యాండింగ్ అయ్యింది. కేరళలోని కొచ్చిన్ విమానాశ్రయం నుంచి దేశ రాజధాని ఢిల్లీకి వెళ్తుం డగా మెడికల్ ఎమర్జెన్సీ అవసరం పడినట్లు తెలుస్తోంది. విమానంలో ప్రయాణిస్తున్న ఓ మహిళ ఉన్న ట్లుండి తీవ్ర అస్వస్థకు గురవ్వడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. దీంతో వెంటనే ఎయిర్ ఇండియా (Air India)విమానాన్ని శంషాబాద్ ఎయిర్ పోర్టులో అత్యవసర ల్యాండింగ్ చేశారు.
అనంతరం సిబ్బంది సాయంతో అంబులెన్సులో (Ambulance)మహిళను శంషాబాద్ అపోలో ఆస్పత్రికి తరలించారు. అయితే, ఆస్పత్రికి తరలిస్తున్న క్రమంలోనే మార్గంమధ్యలో ఆ మహిళా ప్రయాణికురాలు మరణించినట్లు సమాచారం. ఆమెను పరీక్షించిన అపోలొ వైద్యులు ఈ విషయాన్ని ధృవీకరించారు. ఇదిలాఉండగా, మహిళా ప్రయాణికురాలి (Female passenger) మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.