Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Alcohollovers: సందడిగా కొత్త సంవత్సరం సంబరాలు

— సరికొత్త జోష్ లో తెగ తాగేశారు, రూ. 5వేల కోట్ల విక్రయాలు
–తెలంగాణ తలసరి మద్యం వినియోగం రూ.1250

Alcohollovers ప్రజా దీవెన, హైదరాబాద్‌: రాష్ట్ర వ్యాప్తంగా కొత్త ఏడాది సంబరాలకు మద్యం భారీగా కొనుగోలు చేసేశారు. మద్యం ప్రియులు రికార్డు స్థాయిలో కొనుగోళ్లు చేశారు. డిసెంబరు నెల చివరి 9 రోజుల్లో మద్యం అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. 9 రోజుల్లోనే రూ.2166 కోట్ల మద్యం విక్రయాలు జరిగా యి. అంటే మందుబాబులు ఎంత లా తాగేశారో అర్థం చేసుకోవచ్చు వందలాది ఫాంహౌస్‌లు, హోటళ్లు, బార్లు, రెస్టారెంట్లు, పబ్‌లు, క్లబ్‌ల్లో నూతన సంవత్సర వేడుకలు జరి గాయి. యువత మద్యం మత్తులో ఉర్రూతలూగారు. మందు, విందు తో కొత్త సంవత్సరానికి స్వాగతం పలికారు. రాష్ట్రవ్యాప్తంగా డిసెంబ రు నెల చివరి 9 రోజుల్లో రూ.21 66 కోట్ల మద్యం విక్రయాలు జరగ్గా ఒక్క గ్రేటర్‌ హైదరాబాద్‌లోనే రూ.757.2 కోట్ల విక్రయాలు జరిగి నట్లు ఎక్సైజ్‌ అధికారుల గణాం కాలు చెబుతున్నాయి. ఇక డిసెంబ రులో రాష్ట్రంలో తలసరి మద్యం వినియోగం రూ.1250గా నమో దైంది.

అంటే రాష్ట్ర జనాభా దాదా పు 4 కోట్లు ఉంటే ఒక్క నెలలో రూ.5 వేల కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. మద్యం విక్రయాల్లో ఇదో కొత్త రికార్డు అని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. ఎక్పైజ్‌ అధికారవర్గాలు తెలిపిన అంచనా గణాంకాల ప్రకారం డిసెంబరు 31 వరకు ఎక్పైజ్‌ శాఖ రూ.3600 కోట్ల విలువైన మద్యాన్ని దుకాణాలకు విక్రయించింది. గరిష్ఠ విక్రయ ధర (ఎంఆర్‌పీ)పై ప్రభుత్వం 20 శాతం తక్కువకు లైసెన్స్‌ షాపులకు సర ఫరా చేస్తుంది. వారి కమిషన్‌ను లెక్కిస్తే రూ.720 కోట్లు అవుతుంది. అంటే డిసెంబరులో మొత్తం మ ద్యం విక్రయాలు రూ.4320 కోట్లు జరిగాయి. కొత్త సంవత్సరం వేడు కల్లో సహజంగానే ఏటా ఇతర రా ష్ట్రాల నుంచి మద్యం అక్రమ రవా ణా జరుగుతుంది. అలాగే రాష్ట్రం లోని మద్యం తయారీ కేంద్రాల నుంచి ప్రభుత్వ అనుమతు ల్లేకుం డా మద్యం బయటికి వస్తోందన్న ఆరోపణలు వస్తున్నాయి. అక్రమ మద్యం, ఐదు జిల్లాల పరిధిలో గుడుంబా విక్రయాలు కలిపితే రూ.500 కోట్లకు పైనే ఉంటుంది. ఈ లెక్కన రాష్ట్ర ప్రజలు గత నెల లో మద్యపానం కోసం చేసిన ఖర్చు దాదాపు రూ.5 వేల కోట్లవుతుంది. ఇందులో డిసెంబరు 30, 31 తేదీ ల్లో మద్యం విక్రయాల వాటా దాదా పు రూ.900–1000 కోట్ల వరకు ఉంటుందని అంచనా.

అడుగడుగునా డ్రంకెన్‌ డ్రైవ్‌ తనిఖీలు ….కొత్త సంవత్సర వేడుకల్లో ఎలాంటి అపశృతులు, రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు పోలీసులు పకడ్బందీ చర్యలు తీసుకున్నారు. మద్యం అనుమతులు ఉన్న ఈవెంట్ల నిర్వాహకులు మద్యం సేవించిన వారి కోసం ప్రత్యేకంగా డ్రైవర్లను ఏర్పాటు చేసుకోవాలని షరతులు విధించారు. ఎన్ని జాగ్రత్తలు తీసు కున్నా, హెచ్చరికలు చేసినా మం దు బాబులు మాత్రం తగ్గేదే లేదం టూ రోడ్డెక్కారు. ఫుల్లుగా మద్యం తాగి వాహనాలు నడుపుతూ పోలీ సులకు పట్టుబడ్డారు. హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో బ్లడ్‌ అల్క హాల్‌ కౌంట్‌ (బీఏసీ) 51–100 వరకు వచ్చినవారు 554 మంది, 101–200 వరకు 474, 201– 300 వరకు 85, 301–400 వరకు 22, 401–500 వరకు 8 మంది, కౌంట్‌ 500 దాటినవారు ఐదుగురు ఉన్నారు. సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిఽధిలో 839 మందిపై డ్రంకెన్‌ డ్రైవ్‌ కేసులు నమోదు చేశారు. వీరిలో బీఏసీ కౌంట్‌ 100–300 వరకు ఉన్నవారు 366 మంది, 300–500 వరకు వచ్చిన వారు 24 మంది, కౌంట్‌ 500 పైబడిన వారు నలుగురు ఉన్నారు.

రాచ కొండ పరిధిలో డ్రంకెన్‌ డ్రైవ్‌ తని ఖీల్లో పట్టుబడిన వారిలో అత్యధిక బీఏసీ కౌంట్‌ 339గా ఉంది. పంజా గుట్ట ద్వారకాపురిలో డ్రంకెన్‌ డ్రైవ్‌ తనిఖీల్లో టీఎస్‌09ఈకే 3617 వాహనం నడుపుతున్న రియా జుద్దీన్‌ను ట్రాఫిక్‌ పోలీసులు పరీ క్షించారు. బీఏసీ కౌంట్‌ 550 రావ డంతో వాహనాన్ని సీజ్‌ చేసి, కేసు నమోదు చేశారు. ఇప్పటికే ఆ వాహనంపై హెల్మెట్‌ లేకుండా నడి పిన 10 చలాన్లు పెండింగ్‌లో ఉన్నా యి.నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా మద్యం పార్టీలకు రాష్ట్ర వ్యాప్తంగా 287 ఈవెంట్లకు ఎక్సైజ్‌ శాఖ అనుమతిచ్చింది. వీటిలో అత్యధికంగా హైదరాబాద్‌, రం గారెడ్డి జిల్లాల్లో 243 ఉండగా, ఇత ర జిల్లాల్లో 44 ఉన్నాయి. ఈవెంట్‌ లో పాల్గొనేవారి సంఖ్య, మద్యం వినియోగం ఆధారంగా ఈ అను మతులను ఎక్పైజ్‌ శాఖ జారీచే స్తుంది. అనుమతి ధర రూ.5 వేల నుంచి రూ.2.50 లక్షల వరకు ఉంటుంది. మొత్తం ఈవెంట్లతో ఈసారి రూ.56.46 లక్షల ఆదా యం వచ్చిందని అధికారులు తెలిపారు. 2023లో 224 ఈవెం ట్లకు అనుమతులివ్వగా రూ.44. 76 లక్షల ఆదాయం వచ్చింది.

డిసెంబరు 31 రాత్రి హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ కమిషన రేట్ల పరిధిలో తెలంగాణ నార్కో టిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో(ఎన్‌సీబీ) అధికారులు తనిఖీలు నిర్వహిం చారు. డ్రగ్‌ టెస్టింగ్‌ కిట్లతోపాటు మత్తుమందును పసిగట్టే పోలీసు జాగిలాలను రంగంలోకి దింపారు. పబ్బులు, రిసార్టులతో పాటు రోడ్ల మీద ఎన్‌సీబీ సిబ్బంది తనిఖీలు నిర్వహించారు. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత వేర్వేరు ప్రాంతాల్లో మత్తుమందులు వాడిన ఐదుగురు యువకులు పట్టుబడ్డా రని, డ్రగ్‌ టెస్టులో పాజిటివ్‌ రావ డంతో వారిని అదుపులోకి తీసు కున్నామని ఎన్‌సీబీ డైరెక్టర్‌ సందీ ప్‌ శాండిల్య ఓ ప్రకటనలో తెలి పారు. మరోవైపు ఎక్సైజ్‌ పోలీసు లు 30 నుంచి 40 ప్రత్యేక బృందా లను రంగంలోకి దింపారు. మంగళ వారం రాత్రి పలు ప్రాంతాల్లో ఆకస్మి క తనిఖీలు నిర్వహించారు. కొంద రు గంజాయితో పట్టుబడ్డారు. బంజారాహిల్స్‌ పరిధిలో రెండు చోట్ల 313 గ్రాముల గంజాయి దొరికింది. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఎస్‌ఆర్‌ నగర్‌ పరిధిలో 3.37 కేజీల గంజాయిని పట్టుకున్నారు.

నల్లగొండ జిల్లాలో 69.64 కోట్ల వ్యాపారం… నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఉమ్మడి నల్ల గొండ జిల్లాలో ఎక్సైజ్ శాఖకు భారీ ఆదాయం చేకూరింది. ఈనెల 30, 31వ తేదీల్లో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 69.64 కోట్ల మద్యం అ మ్మకాలు జరిగాయి. నల్లగొండ జిల్లాలోని ఏడు సర్కిల్లలో రెండు రోజుల్లో 29.59 కోట్ల మద్యం అమ్మకాలు జరుగగా, సూర్యాపేట జిల్లాలోని 4 సర్కిల్ లలో 20.9 కోట్ల మద్యం అమ్మకాలు, యా దాద్రి భువనగిరి జిల్లాలోని 4 సర్కి ల్ లలో 19.15కోట్ల మద్యం అమ్మ కాలు జరిగాయి. డిసెంబర్ 1వ తేదీ నుండి 29వ తేదీ వరకు నల్ల గొండ జిల్లాలో 137.69 కోట్లు, సూ ర్యాపేట జిల్లాలో 85.45 కోట్లు, యాదాద్రి భువనగిరి జిల్లాలో 74. 14 కోట్ల అమ్మకాలు జరు గగా 1వ తేదీ నుండి 29వ తేదీ వరకు మొ త్తం 297.28 కోట్ల మధ్యమ అమ్మ కాలు జరిగాయి. కేవలం రెండు రోజుల్లో జరిగిన 69.64 కోట్ల రూ పాయలతో కలిపి ఎక్సైజ్ శాఖ కు డిసెంబర్ నెలలో 366.92 కోట్ల రూపాయల ఆదాయం సమకూ రింది.