ప్రజా దీవెన, హైదరాబాద్: పుష్ప విజయోత్సవం పూర్తిస్థాయిలో ఆస్వాదించకముందే ప్రీమియర్ షో ఆందోళన అల్లు అర్జున్ కుoగ తీ స్తోంది. అల్లు అర్జున్ పుష్ప ప్రీమియర్ షో వివాదం చిల్కి చిలికి గాలి వానలా మారి రాజకీయ దూమరాన్ని కూడా లేపిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అల్లు అర్జు న్ సెక్యూరిటీ, నిరసనకారుల మ ధ్య తీవ్ర వాగ్వాదం నెలకుంది. అల్లు అర్జున్ ఇంటిపై దాడి నేప థ్యంలో నిరసనకారులను అదుపు లోకి తీసుకున్నారు.
అకస్మాత్తుగా జరిగిన ఆందోళనలతో తెలంగాణ పోలీసులు అలర్ట్ అయి అల్లు అర్జు న్ ఇంటి దగ్గర భద్రత పెంచారు. ఇంటి రిటర్నింగ్ వాల్ పైకి ఎక్కి రాళ్లు, టమాటాలు విసిరి, పూల కుండీలను ధ్వంసం చేయడంతో అల్లు అర్జున్ ఇంటి దగ్గర తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. సంధ్య థియేటర్ ఘటనలో నేపథ్యంలో అల్లు అర్జున్ నివాసం ముందు ఓయూ జేఏసీ విద్యార్థులు నిర సనకు దిగారు. బన్నీ ఇంటిపై రాళ్ల తో దాడికి దిగారు. ఇంట్లోకి వెళ్లి పూలకుండీలు పగలగొట్టారు నిరస నకారులు. కాంపౌండ్ వాల్ ఎక్కి అల్లు అర్జున్‌కి వ్యతిరేకంగా నినా దాలు చేశారు.
రేవతి మరణానికి అల్లు అర్జున్ కారణమంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు భద్రత ను కట్టుదిట్టం చేశారు. ఈ నేప థ్యంలో నిరసనకారులు కాంపౌండ్ వాల్ ఎక్కి అల్లు అర్జున్‌కి వ్యతి రేకంగా నినాదాలు చేశారు. విద్యా ర్థులు.హీరో అల్లు అర్జున్ ఇంటిపై దాడి నేపథ్యంలో జూబ్లీహిల్స్ పోలీ సులు బన్నీ ఇంటికి చేరుకొని ఘట న వివరాలు నమోదు చేసుకున్నా రు. అయితే ఈ దాడి అనంతరం అల్లు అర్జున్ తన పిల్లలను తన మామ ఇంటికి తరలించినట్టు సమాచారం. ఫ్లకార్డ్సుతో ఇంటి గేటు ముందు నిరసనకు దిగారు.
ఆరుగురు పై కేసు నమోదు…
ఈ దాడి ఘటన నేపథ్యంలో ఆరు గురిపై కేసు నమోదు చేసినట్లు వెస్ట్ జోన్ డీసీపీ తెలిపారు. వారిపై చట్ట రీత్య చర్యలు తీసుకోనున్నట్లు ఆ యన తెలిపారు. ఇలాంటి దాడు లకు పాల్పడితే ఎంతటివారినైనా ఉపేక్షించేది లేదన్నారు.