–తండ్రి అల్లు అరవింద్, మామ చంద్రశేఖర్ రెడ్డి అర్జున్ వెంటే
–ప్రశ్నించిన చిక్కడపల్లి ఏసీపీ, సీఐ
ప్రజా దీవెన, హైదరాబాద్: సినీ నటుడు అల్లు అర్జున్ మంగళ వారం చిక్కడపల్లి పోలీసుల విచా రణకు హాజరయ్యారు. ఉదయం 10.30 గంటల సమయంలో జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 60లోని తన నివాసం నుంచి మామ చంద్ర శేఖర్ రెడ్డి, తండ్రి అల్లు అరవింద్ తో కలిసి పుష్ప ఒకే కారులో చిక్క డపల్లి చేరుకున్నారు. సంధ్య థియే టర్లో జరిగిన తొక్కిసలాట ఘటన తదనంతర పరిణామాలపై పోలీసు లు అల్లు అర్జున్ను ప్రశ్ని స్తున్నారు. ఏసీపీ రమేశ్, ఇన్స్పెక్టర్ రాజునా యక్ సమక్షంలో సెంట్రల్ జోన్ డీసీ పీ ఆకాంక్ష్ యాదవ్ బన్నీని ప్రశ్నిస్తు న్నారు. సుమారు 20 ప్రశ్నలతో కూడిన క్వశ్చన్ పేపర్ ను బన్నీకి అందించారు.
అనుబంధ ప్రశ్నలు వేస్తూ వివరాలు సేకరించారు. పోలీసుల నోటీసులపై నిన్న రాత్రి తన లీగల్ టీమ్‌తో అల్లు అర్జున్ చర్చించారు. న్యాయవాదులతో కలిసి పోలీస్ స్టేషన్ కు వచ్చారు. లీగల్ టీం లోని న్యాయవాది అశో క్ రెడ్డిని మాత్రమే పోలీసులు లోని కి అనుమతించారు. ఆయన సమ క్షంలోనే విచారణ సాగుతోంది. ఈ సందర్భంగా పలు వీడియోలు చూ పుతూ ప్రశ్నిస్తున్నారని తెలుస్తోంది. దీంతో పాటు ఆయన నిర్వహించిన మీడియా సమావేశం గురించి విచా రిస్తున్నారని సమాచారం. కేసు విచారణలో ఉన్న సమయంలోఎందుకు ప్రెస్ మీట్ పెట్టారని పోలీ సులు ప్రశ్నించినట్టు సమాచారం.
పోలీస్ స్టేషన్ వద్ద భారీ బందో బస్తు అల్లు అర్జున్ కు నోటీసులు అందించిన పోలీసులు ఠాణా వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటన లు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటులు చేశారు. సుమారు 200 మీటర్ల దూరం వరకు ఆంక్షలు విధించారు. వాహనాల రాకపోకల ను నిలిపివేశారు.