ప్రజా దీవెన, హైదరాబాద్ : అంబేద్కర్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ పీసీసీ చీఫ్ మహేశ్ కు మార్ గౌడ్ ఆధ్వర్యంలో మంగ ళ వారం ట్యాంక్ బండ్ పై అంబేద్కర్ విగ్రహం వద్ద బాబాసాహెబ్సమ్మాస్ మార్చ్ భారీ ప్రదర్శన చేపట్టారు. అంబేద్కర్ విగ్రహం వద్ద నుంచి హైదరాబాద్కలెక్టరేట్ ఆఫీస్ వరకు ర్యాలీని నిర్వహించారు. నిరసన కార్యక్రమంలో సీనియర్ నాయకు లు వీహెచ్ ,ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, నాయకులు కొప్పుల రాజు, రోహిన్ రెడ్డి పెద్ద ఎత్తున కాంగ్రెస్ నాయకులు, పాల్గొన్నారు.
ఖమ్మంలో భట్టి, మంత్రి తుమ్మల.. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్ర మంలో భాగంగా ఖమ్మం డీసీసీ కార్యాల యం లో నిర్వహించిన కార్యక్ర మంలో డిప్యూటీ సీఎం భట్టి విక్ర మార్క, మంత్రి తుమ్మల నా గేశ్వర రావు పాల్గొన్నారు. పార్టీ ఆఫీస్ నుం చి జడ్పీ సెంటర్ వరకు జరిగి న ర్యాలీలో వారు పాల్గొన్నారు. పాలమూరులో కాంగ్రెస్ పార్టీ ఆధ్వ ర్యంలో అంబేద్కర్ చిత్రపటాలను లో అంబేద్కరిచ్చిత్రపటాలను ప్రద ర్శి స్తూ నిరసన కార్యక్రమాన్ని నిర్వ హించారు.
హనుమకొండలో ..హనుమకొండలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వ ర్యంలో నిరసన కార్యక్రమంలో ఎమ్మె ల్యే లు రాజేందర్ రెడ్డి, కడియం శ్రీహరి, నాగరాజు పాల్గొన్నారు.అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి అక్కడి నుంచి కలెక్టరేట్ వరకు భారీ ప్రద ర్శన చేపట్టారు. అనంతరం కలెక్టరే ట్ లో వినతి పత్రాన్ని అందించారు.
నల్లగొండ జిల్లా నేతలు… బిజెపి నేతలుచేసిన తప్పును కప్పి పుచ్చుకొని దేశ ప్రజలను తప్పు దోవ పట్టిస్తున్నారని పిసిసి నాయ కులు జగన్ యాదవ్ ధ్వజమె త్తారు. బిజెపి నేతలు, అమిత్ షా నోరు జారినందుకే బిజెపి నేతలు వాళ్లకు వాళ్లే ధర్నాలు చేసి తప్పు దోవ పట్టించారని విమర్శించారు. బిజెపి పార్టీకి రాజ్యాంగ మీద గాని ప్రజాస్వామ్యం మీదగాని గౌరవం గాని నమ్మకం గాని లేదనీ ఆరోపించారు. ఈ కార్యక్రమంలో నల్గొండ డిసిసి అధ్యక్షులు శంకర్ నాయక్, మీడియా కన్వీనర్ శ్రీకాంత్ యాదవ్, వచన్ కుమార్ అధికార ప్రతినిధి లింగం యాదవ్, వెంకటరమణ ప్రశాంత్ రెడ్డి, రమేశ్ నాయక్ వెంకన్న నాయక్ తదితరు లు పాల్గొన్నారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.