Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Anand Mahindra: తెలంగాణ స్కిల్ వర్సిటీ చైర్మన్‌గా ఆనంద్ మహీంద్రా

— అమెరికాలో వెల్లడించిన ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి

Anand Mahindra:ప్రజా దీవెన, న్యూజెర్సీ: రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం నూతనంగా ఏర్పా టు చేసిన ప్రతిష్టాత్మక ‘తెలంగాణ స్కిల్ యూనివర్సిటీ’కి చైర్మన్‌గా ప్రఖ్యాత పారిశ్రామికవేత్త, దాత, మహీంద్రా గ్రూప్ అధినేత పద్మ భూషణ్ ఆనంద్ మహీంద్రా వ్యవహరిస్తారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy)వెల్లడించారు.ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న ము ఖ్యమంత్రి ఆదివారం న్యూజెర్సీలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లా డుతూ తెలంగాణ స్కిల్‌ యూని వర్సిటీకి చైర్మన్‌గా వ్యవహరించడా నికి ఆనంద్ మహీంద్రా అంగీకరిం చారని, కొద్ది రోజుల్లోనే బాధ్యతలు స్వీకరిస్తారని తెలిపారు.

తెలంగాణ యువతను ప్రపంచంలోనే ఉత్తమ నైపుణ్యం కలిగినవారిగా తీర్చిది ద్దాలనే లక్ష్యంతో ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంతో ఏర్పాటైన తెలంగాణ స్కిల్ యూనివర్సిటీకి (To Telangana Skill University) అంత ర్జాతీయంగా పేరున్న ప్రముఖుడినే అధినేతగా నియమిస్తామని ముఖ్య మంత్రి గారు ఇటీవల అసెంబ్లీలో నూ ప్రకటించారు. ఆనంద్ మహీం ద్రా ఇటీవల హైదరాబాద్ లో ము ఖ్యమంత్రి సమావేశమైన సంద ర్భంలోనూ తెలంగాణ స్కిల్ యూని వర్సిటీపై చర్చలు జరిపారు. రంగా రెడ్డి జిల్లా ముచ్చర్ల కేంద్రంగా అభి వృద్ది కానున్న ఫ్యూచర్ సిటీ పరి ధిలో బ్యాగరికంచె వద్ద తెలంగాణ స్కిల్ యూనివర్సిటీ భవనానికి ము ఖ్యమంత్రి గతవారం శంకుస్థాపన చేశారు. యూనివర్సిటీలో 17 రకా ల కోర్సుల్లో ఏటా 20వేల మంది విద్యార్థులకు శిక్షణ ఇచ్చి, సర్టిఫికేట్ ఇవ్వడంతో పాటు ఆయా కంపెనీ ల్లో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా కల్పించే ఏర్పాటు చేశారు.

రాబోయే సంవత్సరాల్లో ఏడాదికి లక్ష మందికి శిక్షణ ఇచ్చేలా స్కిల్ వర్సిటీని విస్తరించనున్నారు. బ్యా గరికంచెలో సొంత భవనం పూర్త య్యే వరకు గచ్చిబౌలిలోని ఇంజినీ రింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ESCI) భవంతి నుంచి స్కిల్‌ యూ నివర్సిటీ కార్యకలాపాలు కొన సాగనున్నాయని ఆధికారిక వర్గాలు స్పష్టం చేశాయి.