Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Anand Mahindra: యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్శిటీ ..!

–ఫ్యూచర్ సిటీ లో అంతర్జాతీయ ప్రమాణాలతో క్రీడల వర్శిటీ
–హకీంపేట లేదంటే గచ్చిబౌలి ప్రాంతాల్లో స్థల పరిశీలన
–మొత్తంగా 12 అకాడమీలు సైన్స్‌, మెడిసిన్‌ కేంద్రాలు
–త్వరలో దక్షిణ కొరియా స్పోర్ట్స్‌ వర్సిటీతో ఒప్పందం
–వెల్లడించిన సీఎం ఆనంద్‌ మహీంద్రా ట్వీట్‌కు ఆన్సర్

Anand Mahindra: ప్రజా దీవెన, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రం (Telangana State)లోని యువతలో నైపు ణ్యాభివృద్ధి సాధించడం ద్వారా ప్రైవేటు రంగంలో ఉద్యోగాల సా ధన పై దృష్టి సారించిన రేవంత్ ప్రభుత్వం (Revant Govt)తాజాగా క్రీదాభివృద్ధి పై కేంద్రీకరించింది. ఇటీవలే యంగ్‌ ఇండియా స్కిల్స్‌ యూనివర్సిటీకి శంకు స్థాపన చేసిన ప్రభుత్వం క్రీడ లపైనా ప్రత్యేకంగా దృష్టి సా రించ డం ద్వారా ప్రభుత్వ విజన్ ను ప్రక టిoచింది. స్కిల్స్‌ యూనివర్సిటీ తరహాలోనే స్పోర్ట్స్‌ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని వెల్లడించింది. తదనుగుణంగా యంగ్‌ ఇండియా స్పో ర్ట్స్‌ యూనివర్సిటీగా నామకర ణం కూడా చేయడం గమనార్హం.

గచ్చిబౌలి లేదా కింపేటలో అవకాశం.. గచ్చిబౌలి స్పోర్ట్స్‌ అకాడమీ (Gachibowli Sports Academy)లేదా హకీంపేట స్పోర్ట్స్‌ స్కూల్‌లో దీనిని ఏర్పాటు చేసే అవ కాశం ఉందని ప్రభుత్వ వర్గాలు పే ర్కొంటున్నాయి. కాగా అంత ర్జాతీ య ప్రమాణాలతో నిర్మించాలని భావిస్తున్న ఫ్యూచర్‌ సిటీ (Future City) (ఫోర్త్‌సి టీ)లోని స్పోర్ట్స్‌ హబ్‌లో దాదాపు 12 క్రీడల అకాడమీలను నెలకొల్పా లని ప్రభుత్వం భావిస్తోంది. వీటిలో అంతర్జాతీయ స్థాయి అధునాతన సదుపాయాలు ఉండనున్నాయి. ఈ స్పోర్ట్స్‌ హబ్‌లో స్పోర్ట్స్‌ సైన్స్‌ సెంటర్‌, స్పోర్ట్స్‌ మెడిసిన్‌ సెంటర్‌ కూడా ఉంటాయి. ఈ విషయాన్ని స్వయం గా సీఎం రేవంత్‌ ప్రకటిం చారు. ఇటీ వల ముగిసిన పారిస్‌ ఒలింపి క్స్‌లో భారత్‌ ఒక్క బంగా రు పతకం కూడా సాధించని విష యం విధితమే. ఈ క్రమంలో దీనిని ప్రస్తావిస్తూ ప్రముఖ పారిశ్రా మికవేత్త ఆనంద్‌ మహీంద్రా శనివారం ట్వీ ట్‌ చేశారు. ఒక రజతం, ఐదు కాం స్యాలు 6 పతకాలతో భారత్‌ 71వ స్థానంలో నిలవడంపై ఆవేదన వ్య క్తం చేశారు.

దీనిపై ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి స్పందించారు. ‘డియర్‌ ఆనంద్‌ మహీం ద్రా (Anand Mahindra)జీ ఈ విషయం నేను మీకు ప్రై వేటుగా చెబుదామ నుకున్నా ఇప్పుడు బహిరంగంగా వెల్లడిస్తున్నానoటూ జవాబిచ్చారు. రాష్ట్రంలో ఏర్పాటు చేయబోతున్న స్పోర్ట్స్‌ యునివర్సిటీకి సంబంధిం చిన పూర్తి వివరాలను ఆయనకు ఎక్స్‌లో వివరించారు. ఆ తర్వాత అవే వివరాలతో సీఎం కార్యాల యం ప్రకటన విడుదల చేసింది. వర్సిటీ ఏర్పాటు కు అనువైన స్థలం గా ప్రస్తుతం హకీంపేటలో ఉన్న స్పోర్ట్స్‌ స్కూల్‌ లేదా గచ్చిబౌలిలోని స్పోర్ట్స్‌ కాంప్లె క్స్‌లను పరిశీలిస్తు న్నారు. సదరు క్యాంపస్‌ను ఒలిం పిక్స్‌ స్థాయి అంతర్జాతీయ ప్రమా ణాలుండేలా అప్‌గ్రేడ్‌ చేయాలని నిర్ణయించారు. హకీంపేటలోని 200 ఎకరాలు దీని ఏర్పాటుకు అను వు గా ఉందని గుర్తించినట్లు సమాచా రం.

దక్షిణ కొరియాలోనే ఆలోచన

ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి (Revanth Reddy) ఇటీవల దక్షిణ కొరియా పర్యటనలో భాగం గా సియోల్‌లోని కొరియన్‌ నేషనల్‌ స్పోర్ట్స్‌ యూనివర్సిటీని సందర్శిం చారు. ఇది ప్రపంచంలోనే పేరొందిన స్పోర్ట్స్‌ యూనివర్సిటీగా ప్రత్యేకత చాటుకుంది. ఇటీవల ముగిసిన పా రిస్‌ ఒలింపిక్స్‌లో దక్షిణ కొరియా మొత్తం 32 పతకాలు గెలుచుకోగా, వాటిలో 16 పతకాలు కొరియన్‌ నేషనల్‌ స్పోర్ట్స్‌ యూనివర్సిటీలో శిక్షణ పొందిన అథ్లెట్లు సాధించినవే ఇక్కడ శిక్షణ పొంది, పారిస్‌ ఒలింపి క్స్‌లో ఆర్చరీ విభాగంలో మూడు బంగారు పతకాలు సాధించిన అథ్లెట్‌ లిమ్‌ సి–హైయోన్‌ను సీఎం రేవంత్‌ తన పర్యటనలో కలిసి అభి నందించారు.

భవిష్యత్తు ఒలింపిక్‌ చాంపియన్లకు (Olympic champions) శిక్షణ ఇచ్చేలా తెలం గాణ యంగ్‌ ఇండియా స్పోర్ట్స్‌ యూనివర్సిటీకి సాంకేతిక భాగస్వా ములుగా కొరియన్‌ నేషనల్‌ స్పో ర్ట్స్‌ యూనివర్సిటీ సేవలు వాడుకో వాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోం ది. మణిపూర్‌ రాజధాని ఇంఫాల్‌లో మోదీ సర్కారు 2018లో నేషనల్‌ స్పోర్ట్స్‌ యునివర్సిటీని ఏర్పాటు చేసింది. దేశంలో ఏకైక జాతీయ క్రీడల విశ్వవిద్యాలయం ఇదే. రాష్ట్రాల్లో మాత్రం మొట్టమొదటి సారి తమిళనాడు ఫిజికల్‌ ఎడ్యు కేషన్‌, స్పోర్ట్స్‌ యునివర్సిటీని (Physical Education and Sports University)అక్కడి రాష్ట్ర ప్రభుత్వం 2004లో ప్రారంభించింది. తర్వాత మహారా జా భూపేందర్‌ సింగ్‌ స్పోర్ట్స్‌ యుని వర్సిటీని పంజాబ్‌ ప్రభుత్వం పటి యాలాలో 2019లో ఏర్పాటు చేసిం ది. మధ్యప్రదేశ్‌, ఢిల్లీ, అసోంల్లోనూ స్పోర్ట్స్‌ వర్సిటీలను ఏర్పాటు చేశా రు. తాజాగా తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంతో క్రీడల కోసం ప్రత్యేకంగా విశ్వవిద్యాలయం స్థాపించిన రా ష్ట్రంగా తెలంగాణ పేరు ప్రఖ్యాతలు తన ఖాతాలో వేసుకోనుంది.