–కోడిగుడ్డును రెండు ముక్కలు చేసి పిల్లలకి ఇవ్వండి
–టేక్ హోమ్ రేషన్ విషయంలో మరింత జాగ్రత్తగా వుండండి
–త్వరలో అంగన్వాడి కేంద్రాల్లో ఆకస్మిక తనిఖీలు ఉంటాయి
–విధుల్లో అలసత్వం వహిస్తే చర్య లు తప్పవు
–అధికారుల వీడియో కాన్ఫరెన్స్ లో మంత్రి సీతక్క
Anasuya Sitakka: ప్రజా దీవెన, హైదరాబాద్: అంగన్వాడి కేంద్రాల్లో ( Anganwadi Centres)అందిస్తున్న సేవలను మరింత మెరుగుపరిచేలా మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క Anasuya Sitakka) అధికారులకు దిశా నిర్దేశం చేశారు. అంగన్వాడి టీచర్లకు ప్రతి నెల ఇస్తున్న శిక్షణ కార్యక్రమాలను ఆయాలకు కూడా వర్తింప చేయడం ద్వారా అంగన్వాడి కేంద్రాల్లో తలెత్తే సమస్యలను పరిష్కరించవచ్చన్నారు.
మహిళా శిశు సంక్షేమ శాఖ పై సచివాలయం నుంచి జిల్లా అధికారులతో గురువారం నాడు మంత్రి సీతక్క వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాల్లో సేవలను మరింత విస్తృతపరచాలని సూచించారు. అంగన్వాడీలో చిన్నారులకు ఇస్తున్న కోడి గుడ్డును (Chicken egg) రెండు ముక్కలుగా చేసి ఇస్తే.. చిన్నారులకు తినడానికి అనువుగా ఉండటంతోపాటు, గుడ్డులో ఏదన్నా నలత వున్నా గుర్తించి పడేయవచ్చని చెప్పారు.
అంగన్వాడి కేంద్రాల్లో కోడిగుడ్లను, వస్తువులను (Eggs and goods at Anganwadi centers)భద్రపరచుకునే వ్యవస్థను గత ప్రభుత్వం ఏర్పాటు చేయలే లేకపోయిందని మంత్రి సీతక్క తెలిపారు. ఆహార పదార్థాలను నిల్వ చేసుకునే పాత్రలను, కోడిగుడ్లను భద్రపరిచే రాక్ లను అందచేస్తామన్నారు. టేక్ హోమ్ రేషన్ లో భాగంగా ఇస్తున్న వస్తువుల నాణ్యతను లబ్ధిదారుల నుంచి లికిత పూర్వకంగా ధ్రువీకరించుకోవాలని సూచించారు. ప్రతికూల పరిస్థితులను ప్రాంతాల్లో టేక్ హోమ్ రేషన్ ను వారింటికి తీసుకువెళ్లి ఇవ్వాలని సూచిం చారు. తద్వారా ఎక్కడైనా సమ స్యలు ఏర్పడితే బాధ్యులపై చర్య లు తీసుకోవడానికి వీలుంటుందని చెప్పారు.పై అధికారులు అంగన్వా డీ కేంద్రాలను విరివిగా సందర్శిం చాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు.
అంగన్వాడి కేంద్రాల (Anganwadi Centres)పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకో వాలని పేర్కొన్నారు.విధుల పట్ల అలసత్వం వహిస్తే ఉపేక్షించేది లేదని, మొదట వార్నింగ్ ఇచ్చి తర్వాత విధుల నుంచి తప్పిస్తామని హెచ్చ రించారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా నాణ్యమైన భోజనం అందేలా చూసే బాధ్యత సంబంధిత అధికారుల దేనని, ఇక్కడ తప్పు జరిగిన అక్కడి అధికారులపై చర్యలు తప్పవని తేల్చిచెప్పారు. ఇకపై అంగన్వాడి కేంద్రాల్లో ఆకస్మిక తనిఖీలుంటాయని, సీఎం,(cm) మంత్రులు సైతం అంగన్వాడీ కేంద్రాలను సందర్శిస్తారని సీతక్క స్పష్టం చేశారు.వచ్చే నెల 4వ తారీఖు నుండి జిల్లాల్లో పర్యటించి శాఖ పరంగా అమలవుతున్న పథకాల అమలు తీరు, పనుల పురోగతిని సమీక్షిస్తానని మంత్రి స్పష్టం చేశారు. పూర్వ ప్రాథమిక పాఠాలను బోధించేలా అంగన్వాడి కేంద్రాలను సమాయత్తం చేయాలని ఆదేశించారు. దేశానికి ఆదర్శంగా మన అంగన్వాడీ పాఠశాలలు ఉండాలని..ఆ దిశలో టీచర్లకు శిక్షణ ఇస్తున్నామన్నారు.
ఈ కార్యక్రమంలో మంత్రితోపాటు మహిళా శిశు సంక్షేమ శాఖ కమిషనర్ కాంతి వెస్లీ తదితర వున్నతాధికారులు పాల్గొన్నారు.